Food: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే సరైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా క్రమ పద్ధతిలో తీసుకోవడం కూడా చాలాముఖ్యమే అని అంటున్నారు. అయితే క్రమ పద్ధతిలో తీసుకోవడం అంటే ప్రతిరోజు టైం టు టైం భోజనం చేయడం లేదా ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వంటివి చేస్తూనే.. వీటిని నెమ్మదిగా తీసుకోవాలని అంటున్నారు. అంటే కొందరు తొందరగా ఆహారం తీసుకోవాలని ఆత్రుతతో గబగబా తింటూ ఉంటారు. అంతేకాకుండా తొందరగా ఆహారం తినడం వల్ల ఎక్కువగా తీసుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అవి ఎలా అంటే?
ఏ పని అయినా తొందరగా పూర్తి చేయడం కొందరికి అలవాటు. అలాగే ఆహారం కూడా తొందరగా తినేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆహార పదార్థాలు ఏవైనా గబగబా తినాలని అనుకుంటారు. ఇదే సమయంలో ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగుతూ ఉంటారు.. ఇలా బాగా నమలకుండా ఆహారం తినడం వల్ల అవి జీర్ణం కాకుండా శరీరంలోకి అలాగే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇవి ఒక వేస్ట్ లాగా పేరుకుపోయి కొవ్వు తయారవుతుంది. ఈ కొవ్వుతో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గబగబా తినేవారు బాగా నమలక పోవడంతో సరైన క్రమంలో జీర్ణం కాకుండా పేగులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఏదైనా ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆహారాన్ని నమలడం వల్ల కడుపులో త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. నేటి కాలంలో కొందరు శారీరక శ్రమ పడడం లేదు. ఇలాంటివారు తప్పకుండా ఆహారాన్ని బాగా నమలాలి. అలా చేస్తే వెంటనే జీర్ణమై ఎటువంటి సమస్యలు ఉండవు. ఎక్కువసేపు మీరు కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకు పోయే అవకాశం ఉంది. అయితే ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల కొవ్వు పేరుకుపోయే సమస్య ఉండదు.
అలాగే ఆహారాన్ని బాగా నమ్మడం వల్ల దవడలు కూడా వ్యాయామం చేసినట్లు అవుతాయి. దీంతో ఫేస్ మొత్తం ఎక్సర్సైజ్ అయి యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తొందరగా మృత కణాలు వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఎటువంటి ఆహారాన్ని అయినా బాగా నమిలి తినే అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ రకమైన అలవాటును ఉండడం వల్ల వారికి భవిష్యత్తులో ఎలాంటి కొవ్వు సమస్యలు ఉండకపోవచ్చు. చాలామంది పిల్లలు ఆహారాన్ని పూర్తిగా నామలరు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.