OG Movie Promotions: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. మరి ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా తెలుగు ప్రేక్షకులందరి మన్ననలు పొందాడు. ఇక ఇప్పటికే ఆయన కోసం పడి చచ్చిపోయే అభిమానులు కొన్ని కోట్లలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. హరి హర వీరమల్లు సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించక పోయినా కూడా ప్రస్తుతం ఓజీ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈనెల 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రిలీజ్ కి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఇలాంటి సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేపట్టడం లేదంటూ భారీ ఎత్తున వార్తలైతే వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రమోషన్స్ ఏమీ పెద్దగా అవసరం లేదు. ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ప్రేక్షకులు ఆసక్తిగా ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రమోషన్ చేయాల్సిన పనిలేదని కొంతమంది అంటుంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత హైపునప్పటికి ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది.
ఎందుకంటే ఒకానొక సందర్భంలో ప్రమోషన్స్ సరిగ్గా చేయలేకపోతే సినిమా మీద హైప్ అయితే క్రియేట్ అవ్వకపోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఒక్కసారి సినిమా చూడండి అని చెప్తే మాత్రం ఆ హైప్ తారా స్థాయికి వెళ్ళిపోతోంది. మరి ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈనెల 25వ తేదీన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా సినిమాతో ఆయన ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం ఇంకో పది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…ఇక సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే సుజీత్ కి పాన్ ఇండియాలో చాలా మంచి క్రేజ్ అయితే వస్తోంది…