Mirai Movie Hindi Collection: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) తెలుగు లోనే కాదు, హిందీ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ మన తెలుగు సినిమా సత్తాని చాటుతుంది. హిందీ మార్కెట్ అనేది ఇప్పుడు ఎవరికీ ఎక్సక్లూసివ్ మార్కెట్ కాదు. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా సరైన కంటెంట్ తో వాళ్ళ ముందుకు వస్తే నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మిరాయ్ చిత్రం మరో లేటెస్ట్ ఉదాహరణగా నిల్చింది. మన హీరోలు చేయాల్సింది ఏమి లేదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాని తీసి, బాలీవుడ్ లో కాస్త ప్రమోట్ చేసుకోవాలి అంతే. పుష్ప, కాంతారా, కార్తికేయ 2 లాంటి చిత్రాలు ప్రొమోషన్స్ లేకుండానే దుమ్ము లేపాయి అనుకోండి అది వేరే విషయం. కంటెంట్ బాగుంటే చాలు. కంటెంట్ బాగాలేకపోతే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తున్నారు.
అలా తయారైంది బాలీవుడ్ పరిస్థితి. అంతే కాదు కంటెంట్ బాగున్న సినిమాలకు బాలీవుడ్ లో లాంగ్ రన్ కనీసం రెండు నెలల వరకు ఉంటుంది. మన టాలీవుడ్ లో మహా అయితే మూడు వారాలకు మించి లాంగ్ రన్ ఉండడం లేదు ఈమధ్య. ఒకప్పుడు మన టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ఎంత అడ్వాంటేజ్ అయ్యిందో, ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ అంతటి అడ్వాంటేజ్ గా నిల్చింది. ఇక మిరాయ్ విషయానికి వస్తే మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం కోటి 75 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు ఏకంగా 3 కోట్ల 10 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే రెండింతల ఎక్కువ వసూళ్లు రెండవ రోజు వచ్చింది అన్నమాట. మూడవ రోజు కూడా మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నార్త్ ఇండియా లో నమోదు అయ్యాయి.
ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకు మూడవ రోజున 5 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అలా మూడు రోజులకు పది కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్న ఈ సినిమాకు లాంగ్ రన్ లో కూడా స్టడీ రన్ ఉంటుందని, ఫుల్ రన్ లో కచ్చితంగా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే కనుక నిజమైతే తేజ సజ్జ ఇక నార్త్ ఇండియా లో స్థిరపడినట్టే అనుకోవచ్చు. ఆయన గత చిత్రం హనుమాన్ కూడా నార్త్ ఇండియా లో 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి, ఇప్పుడు ‘మిరాయ్’ చిత్రానికి హనుమాన్ కంటే బెటర్ ట్రెండ్ నడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.