https://oktelugu.com/

Drinking alcohol : మందు తాగేటప్పుడు నిజాలు మాట్లాడుతారు. దీనికి కారణం తెలుసా?

జనాలు ఇష్టంగా తాగే ఆల్కహాల్ భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుందట. అందుకే తాగినవారు ఎక్కువగా మాట్లాడుతుంటారు అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి చాలా వేగంగా గట్టిగా మాట్లాడుతారు. అయితే మందు తాగితే నిజాలు మాట్లాడతారు అనుకుంటారు. కానీ ఇది ఎంత వరకు నిజం? కొందరు నిజాలు మాట్లాడితే కొందరు నోటికి ఏది వస్తే అది వాగుతుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2024 / 02:31 AM IST

    Drinking Alcohol

    Follow us on

    Drinking alcohol : మందు తాగుతూ ఫుల్ ఖుషీ అవుతారు మందుబాబులు. చిల్ అవుతూ మందులో మునిగితేలుతుంటారు. మందుబాబులం మేము మందుబాబులం అంటూ చిందేస్తుంటారు. ఇక తాగిన తర్వాత ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుతుంటూ దునియాలో జరిగిన అన్ని విషయాలు చెబుతుంటారు. వారు చేసిన మంచి చెడు మొత్తం ఓపెన్ అవుతుంటారు. అన్ని విషయాలను పూస గుచ్చినట్టు చెప్పేవాళ్లు కూడా ఉంటారు. కొందరు కాస్త తాగి పడుకుంటే ఇంకొందరు ఫుల్ గా వాగుతుంటారు. తాగి పడుకునేవాళ్ల గురించి టెన్షన్ ఉండదు. కానీ కాస్త తాగినా కూడా ఫుల్ గా మాట్లాడుతూ లొల్లి లొల్లి చేసే వారి గురించే పెద్ద టెన్షన్ కదా. అయితే వీళ్లు ఇలా ఎందుకు మాట్లాడుతారో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు చూసేద్దాం. ఓ సారి లుక్ వేయండి.

    జనాలు ఇష్టంగా తాగే ఆల్కహాల్ భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుందట. అందుకే తాగినవారు ఎక్కువగా మాట్లాడుతుంటారు అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి చాలా వేగంగా గట్టిగా మాట్లాడుతారు. అయితే మందు తాగితే నిజాలు మాట్లాడతారు అనుకుంటారు. కానీ ఇది ఎంత వరకు నిజం? కొందరు నిజాలు మాట్లాడితే కొందరు నోటికి ఏది వస్తే అది వాగుతుంటారు.ఇక మందు తాగితే నిజాలు మాట్లాడతారనేది పూర్తిగా నిజం కాదు అంటున్నారు నిపుణులు. అందరూ తాగితే నిజాలు మాట్లాడతారు అంటారు కానీ ఇందులో పూర్తిగా నిజం లేదు అన్నమాట. దీన్ని శాస్త్రీయంగా నిరూపించలేదు.

    మద్యం మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగాల మీద ప్రభావం చూపిస్తుందట. దీంతో సాధారణంగా తీసుకునే నిర్ణయాల కంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భిన్నంగా ఉండవచ్చు. మద్యం తాగినప్పుడు మన ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కానీ ఇలా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మద్యం తాగేవారి స్పృహను మందగిస్తుంది. ఇలాంటి సమయంలో చుట్టూ జరుగుతున్న వాటిని స్పష్టంగా గ్రహించలేరు.

    మద్యం మెదడులోని నిషేధాలను తొలగిస్తుంది కాబట్టి సాధారణంగా చెప్పని విషయాలను చెప్పడానికి ప్రేరేపిస్తుందట. మద్యం తాగినప్పుడు, భయం అనే భావన ఎక్కువగా ఉండదు. దీంతో మనం సాధారణంగా చెప్పడానికి భయపడే విషయాలను కూడా ఈ సమయంలో చెబుతారు. మిగతా వారు మద్యం తాగుతుంటే.. ఇతరులు కూడా అదే చేయడానికి ఒత్తిడికి గురవుతారు అంటున్నారు నిపుణులు. అంటే మీరు కూడా నార్మల్ సమయంలో కంటే భిన్నంగానే బిహేవ్ చేస్తారు.

    ఒకరిపై మద్యం ప్రభావం ఎలా ఉంటుందో అనేది వారి శరీర నిర్మాణం, మద్యం తాగిన పరిమాణం, వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు నిపుణులు.మద్యం తాగడం వల్ల కాలేయ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక ఎన్నో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక ఈ మద్యం తాగడం చాలా మందికి ఒక వ్యసనంగా మారుతుంది. ఒకవేళ మీరు మద్యం తాగడం మానకపోతే.. వైద్య సహాయం తీసుకొని అయినా సరే మందు తాగడం మానేయండి. లేదంటే ఎన్నో సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ప్రతి సినిమాలో కూడా మద్యం తాగవద్దు అంటూ చెబుతుంటారు. సినిమాలో చాలా విషయాలు నేర్చుకుంటారు కానీ ఈ విషయాన్ని మాత్రం చాలా మంది పాటించరు. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి కాస్త ఆలోచించండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.