Drinking alcohol : వామ్మో ఈ రోజు 31 డిసెంబర్. రేపు మందు లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో ఏంటో? ఫుల్ గా డ్రింక్ చేస్తారు ప్రజలు. వైన్ షాపుల ముందు పెద్ద లైన్ ఉంటుంది. ఒక్కొక్కరు లీటర్ల కొద్ది తాగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ రోజు తాగడానికి వెనకాడని ఓ మందు బాబులు రేపటి సంగతి కూడా గుర్తు పెట్టుకోండి. మద్యం హానికరం అని చెప్పినా సరే పట్టించుకోకుండా తాగుతుంటారు. ఇక మిమ్మల్ని మార్చడం ఎవరి వల్ల కాదుగానీ.. జర మందు తాగేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఇక తాగిన వారికి చాలా మందిలో వాంతులు అవుతాయి. దీనికి కారణం తెలుసా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో మందు బాటిల్ల మీద రాసి ఉంటుంది. అయినా సరే ఎవరు ఈ విషయాన్ని పట్టించుకుంటారు కదా. వారి పంతం వారిదే. వినే వారు చాలా తక్కువగా ఉంటారు. జబ్బుల బారిన పడితారు అని చెప్పినా సరే లెక్కచేయరు. మద్యం వ్యసనానికి బానిసై దాన్ని సేవించడమే ఒక పనిగా పెట్టుకుంటారు. దీని వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఆరోగ్యం కూడా పాడు అవుతుంది. మద్యం సేవించినప్పుడు.. డోపమైన్, ఎండార్ఫిన్ రిలీజ్ అవుతాయి. తాత్కాలికంగా ఉత్తేజం కలిగినా సరే తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక చాలా మందికి రాత్రి మందు తాగితే పొద్దున హ్యాంగోవర్ బారిన పడుతుంటారు. తలనొప్పి, మైకం, నీరసం, బద్దకం వంటి సమస్యల బారిన పడతారు. అంటే మీ బాడీ సామర్థ్యం కంటే మీరు ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నారు అని అర్థం. ఇక ఇప్పుడు హ్యాంగోవర్‌ను తప్పించుకోవడానికి ఎలాంటి మందులు లేవు. ఇక లివర్.. గంటకు 8 నుంచి 12 గ్రాముల మధ్య ఆల్కహాల్‌ను బ్రేక్ చేస్తుంటుంది. మీరు హ్యాంగోవర్‌లో ఉంటే మీ లివర్ ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ చేయలేదని అర్థం చేసుకోవాలి. మత్తు దిగేవరకు హైడ్రేటడ్‌గా ఉండాలి. ఇంతకు మించి మీరు చేసేది కూడా ఏం లేదు. అయితే రెడ్ వైన్ ఎక్కువ హ్యాంగోవర్‌కు కారణం అవుతుంది. వోడ్కా వల్ల హ్యాంగోవర్ సమస్య ఎక్కువ ఉండదు అంటున్నారు నిపుణులు.
కొంతమంది మద్యం సేవించిన తర్వాత వాంతులు చేసుకుంటారు. ఇక ఆల్కహాల్ బాడీలోకి వెళ్లిన తర్వాత మొదటి దశ విచ్ఛిన్న ప్రక్రియలో ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీని వల్లే వాంతులు వస్తాయి. ఈ రసాయనం రిలీజైనప్పుడు కొందరిలో వాంతులు కామన్ గా అవుతాయి. వాంతులు అవుతున్నాయి అంటేఆల్కాహాల్‌ను బయటకు పంపాలని.. మీ బ్రెయిన్ మీకు చెబుతున్నట్టు. ఇక వాంతులు అవుతున్నా మీరు మద్యం తాగితే మాత్రం మీ బతుకు షెడ్డుకే అని ఫిక్స్ అయిపోండి. కిక్ కోసం తాగితే కక్కు వస్తుంది. అయినా మానకపోతే రోగం వస్తుంది జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..