https://oktelugu.com/

S S Thaman: డాకు మహారాజు సినిమాకు సంబంధించి తమన్, ప్రగ్యా జైశ్వాల్ మధ్య ఏం జరుగుతోంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : December 31, 2024 / 08:06 PM IST

    Music Director S S Thaman

    Follow us on

    S S Thaman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఒక సినిమా సక్సెస్ అవ్వడంలో సినిమా హీరోలతో పాటుగా సినిమా దర్శకులు చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. నిజానికి సినిమా సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఆ సినిమాలో కీలకపాత్ర వహించాల్సిన అవసరమైతే ఉంటుంది. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న తమన్ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలకు మ్యూజిక్ ని అందించడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ‘డాకు మహారాజు’ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపును పొందే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన మరొక మెట్టు పైకి ఎక్కే విధంగా మ్యూజిక్ ఉండబోతున్నట్టుగా ఈ సినిమా డైరెక్టర్ అయిన బాబి చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అయితే రీసెంట్ గా ‘డాకు మహారాజు’ అన్ స్టాపబుల్ షో కి వచ్చారు. అందులో డైరెక్టర్ బాబి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ షో కి హాజరైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ షో కి సంబంధించిన ప్రోమో ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

    ఇక ఇందులో బాలయ్య ప్రగ్యా జైశ్వాల్ కి ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఆమె అమ్మో తమన్ అని ఒకసారి గా అంది.. అంటే ఆమె ఎలా ఎందుకు అంది అంటూ బాబి ఒక క్వశ్చన్ ని రేకెత్తించాడు. దాంతో నార్మల్ గా ఎలా అంది అంటూ తమన్ కవర్ చేయగా, నాగవంశీ మాత్రం మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ ఒక ప్రశ్నను రేకెత్తించాడు.

    ప్రస్తుతం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రగ్యా జైశ్వాల్ కి తమన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ షో టెలికాస్ట్ అయితే గాని దానికి సంబంధించిన విషయం ఏంటి అనేది మనకు ఒక ఐడియా అయితే రాదు…