Break up : ప్రస్తుతం యువత ఎక్కువగా డిప్రెషన్, బ్రేకప్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు ఒక్కసారి దూరం అయితే తట్టుకోవడం కష్టం. కొందరు తొందరగా బ్రేకప్ నుంచి బయట పడితే మరికొందరు ఎన్ని ఏళ్లు అయిన ప్రేమించిన వాళ్లని మరిచిపోలేరు. అయిన మర్చిపోవడం చెప్పినంత ఈజీ కూడా కాదు. ప్రేమించిన వాళ్లని మరచిపోలేక చాలా మంది వాళ్ల కేరీర్ పాడుచేసుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా ఈరోజుల్లో ఎక్కువ మంది మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారు. బాగా డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. దీనివల్ల మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలు అన్నిటికి చెక్ పెట్టాలంటే కొన్ని నియమాలు పాటిస్తే.. బ్రేకప్ సమస్య నుంచి విముక్తి పడతారు.
వర్క్ లో బిజీగా ఉండండి
బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లో ఉన్నవాళ్లు ఎక్కువగా బాధపడుతూ ఒంటరిగా కూర్చుంటారు. జీవితాన్ని ఇలా ఇక్కడితో ఆపేయకుండా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి. ఒంటరిగా కూర్చుని అలా బాధ పడకుండా వర్క్ లో బిజీగా ఉండండి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో ఉంటే బాధ గుర్తుండదు. కొత్త కొత్త విషయలు నేర్చుకోవడం, వంటలు చేయడం వంటివి చేయాలి. ఇలా ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం వల్ల బాధ నుంచి తొందరగా బయటకు రావచ్చు.
సోషల్ మీడియాకి దూరంగా ఉండండి
ఈరోజుల్లో అందరు సోషల్ మీడియాతో బిజీగా ఉంటున్నారు. అయితే బ్రేకప్ తరువాత సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. ఎందుకు అంటే సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మీరు ప్రేమించిన వ్యక్తి గురించి తెలిసే అవకాశం ఉంటుంది. వాటిని చూసి మీరు ఇంకా బాధపడవచ్చు. కాబట్టి సోషల్ మీడియాకి కాస్త దూరం ఉంటే బెటర్.
కొత్త ప్రదేశాలకు వెళ్లండి
బ్రేకప్ అయితే ఒంటరిగా కూర్చుని బాధపడకుండా.. విహార యాత్రలకు వెళ్లండి. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల మనసుకు హాయి తగులుతుంది. కొత్త పరిచయాలు, కొత్త ప్లేస్ వల్ల ప్రేమించిన వ్యక్తిని మరిచిపోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాతావరణం మనకు చాలా నేర్పుతుంది. దీని వల్ల ఈజీగా మీరు ప్రేమించిన వ్యక్తిని మరిచిపోతారు.
డైరీ రాయండి
చాలా మంది బాధలను మనసులోనే దాచుకుంటారు. మనసులో ఉన్న బాధను ఇతరులతో చెప్పుకుంటేనే కొంత ఫ్రీ అవుతారు. ఎవరికీ చెప్పలేం అనుకునే వాళ్లు డైరీ రాయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ మనసులోని భారం ఒక్కసారిగా తగ్గుతుంది.
అందరితో కలిసి ఉండండి
బ్రేకప్ అయ్యిందని ఎప్పుడు ఒంటరిగా కూర్చుని బాధ పడకుండా అందరితో కలిసి సరదాగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. అప్పుడే బ్రేకప్ నుంచి బయట పడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.