https://oktelugu.com/

Health Tips: ఈ ఆహారాలు తింటే ఆఫీస్ టైమ్ లో నిద్ర వస్తుంది జాగ్రత్త..

జీర్ణక్రియ సమయంలో బియ్యంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతుంటాయి. గ్లూకోజ్‌కు ప్రతిస్పందనగా ఇన్సులిన్ విడుదల అవడంతో శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ వంటి రసాయనాల స్థాయిలను పెంచుతుంది. ఈ హార్మోన్లు విశ్రాంతి, నిద్రమత్తును ఎక్కువ చేస్తాయి. అందుకే మధ్యాహ్న భోజనంలో రైస్ ఐటమ్ తినవద్దు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 10, 2024 / 04:00 AM IST

    Health Tips(2)

    Follow us on

    Health Tips: ఉదయం తిన్న ఆహారాన్నే మళ్లీ మధ్యాహ్నం తింటారు చాలా మంది. రెండు సార్లు ఒకే రకమైన ఫుడ్ తినడం వల్ల ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంటుందట. దీని వల్ల పనికి ఆటంకం కలిగుతుంది. ఆఫీస్ లో పని చేస్తుంటే నిద్ర వస్తుంది. మీ బాస్ చూస్తే తిట్లు కూడా తప్పవు కదా. ఇవి మాత్రమే కాదు ఆఫీస్ లో లేదా మరే ఇతర పనిలో అయినా సరే నిద్ర రావడానికి కారణం ఏంటో తెలుసా?

    వేపుళ్ళు, కేక్ ఐటమ్ : సాధారణంగా వేపుళ్లు చాలా లేట్ గా జీర్ణం అవుతాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేపుడు పదార్థాలు టేస్ట్ గా ఉన్నా అరుగుదల తక్కువ. అందువల్ల పనిలో ఉంటే వీటి జోలికి పోకండి. కేకులు, పేస్ట్రీలు వంటి బేకరీ వస్తువులను కూడా తాకవద్దు. ఇవి కూడా మిమ్మల్ని నిద్రమత్తులోకి తీసుకెళతాయి. అలసట వచ్చేలా చేస్తాయి. ఆఫీసులో ఉన్నప్పుడు చురుగ్గా పని చేయాలంటే అధిక కొవ్వు పదార్థాలున్న ఫుడ్ తినవద్దు.

    అన్నం : జీర్ణక్రియ సమయంలో బియ్యంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతుంటాయి. గ్లూకోజ్‌కు ప్రతిస్పందనగా ఇన్సులిన్ విడుదల అవడంతో శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ వంటి రసాయనాల స్థాయిలను పెంచుతుంది. ఈ హార్మోన్లు విశ్రాంతి, నిద్రమత్తును ఎక్కువ చేస్తాయి. అందుకే మధ్యాహ్న భోజనంలో రైస్ ఐటమ్ తినవద్దు. లేదంటే నిద్రమత్తుతో ఇబ్బందులు పడాల్సిందే. ఎక్కడ ఉన్నా కునిపాట్లు పడుతూ కనిపిస్తుంటారు. మీరు ఆఫీస్ లో కూర్చొని పనిచేయాలి కనుక అంటే రైస్ తినవద్దు.

    ఇవి కూడా: వోట్స్, బియ్యం, టమోటాలు, పుట్టగొడుగులు, పిస్తాపప్పులు, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఐటమ్స్ తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం కామన్. అందుకే వర్కింగ్ టైమ్ లో ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండటం ఉత్తమం. ఆఫీసుల్లో కూర్చొని పనిచేసే వారికే ఎక్కువ నిద్ర మత్తు వస్తుంటుంది. తిరుగుతూ పని చేయడం, బరువులు ఎత్తుతూ పనిచేస్తే ఎలాంటి ఫుడ్ తిన్నా ఇట్టే జీర్ణం అవుతుంది. కానీ కూర్చొని పని చేస్తేనే ఇబ్బంది. సో జాగ్రత్త.

    ప్రోటీన్ ఆహారం: అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తింటే కూడా అలసట ఎక్కువ వస్తుంది. మీరు రోజంతా చురుకుగా ఉండాలనుకుంటే ప్రోటీన్ తీసుకోవడం అవసరమే అయినా ఎక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకోవద్దు. పాలు, పాలకూర, విత్తనాలు, సోయా ఉత్పత్తులు, చికెన్ ఉత్పత్తులను మధ్యాహ్నం భోజనం సమయంలో స్కిన్ చేయండి. జీర్ణం కావడానికి ఎక్కువ శక్తిని తీసుకునే ఈ ఆహారాల ద్వారా నీరసం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. మీ శరీరం కూడా విశ్రాంతి కావాలి అనుకుంటుంది. అందుకే కూర్చొని పని చేసే వారు ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

    చక్కెర ఐటమ్స్: ఈ కాలంలో చక్కెర లేకుండా ఏ ఫుడ్ ఐటమ్ రెడీ అవడం లేదు కదా. స్వీట్లలో ఇంతకు ముందు బెల్లం కూడా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం అన్నింట్లోనూ చక్కెర ఉపయోగిస్తున్నారు. చక్కెరతో కూడిన ఆహారాలు కూడా తింటే కూడా నిద్ర వస్తుంది జాగ్రత్త.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.