Coconut Water : ఎండాకాలం ఎండలకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాటర్ ఎంత తాగినా కూడా మరింత తాగాలి అనిపిస్తుంది. ఇక చల్ల నీరు అయితే మరీ ఎక్కువ తాగాలి అనిపిస్తుంది. ఈ కాలంలో జ్యూస్ లు, కొబ్బరి నీరు కూడా అదే రేంజ్ లో తాగాలి అనిపిస్తుంది కదా. ఇంతకీ ఈ నీరును అందరూ తాగవచ్చా లేదా? ఎవరు తాగాలి అనే వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
శీతలీకరణ స్వభావ శరీరం ఉన్నవారు కొబ్బరి నీరును తాగకూడదు అంటారు. దీని వల్ల శరీరం బలహీన పడుతుంది. అలసట వస్తుందట. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు కూడా కొబ్బరి నీరును తాగకూడదు అంటారు నిపుణులు. దీని వల్ల గర్భస్రావం జరుగుతుందట. అదే విధంగా ఉబ్బరం, మార్నింగ్ సిక్నస్, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తాయట.
ఎండలో తిరిగిన వెంటనే కూడా కొబ్బరి నీరును తాగకూడదు. నిద్రపోవడానికి ముందు కూడా కొబ్బరి నీరు తాగకూడదు అంటారు నిపుణులు. ఇలా చేయడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందట. మూత్ర పిండ సమస్యలు ఉన్న వారు కూడా కొబ్బరి నీరు తాగకూడదు. కొబ్బరి నీటిలో పొటాషియం ఉంటుంది.
పొటాషియం కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారిలో హైపర్ కలేమియా సమస్యలను పెంచేలా చేస్తుందట. అందుకే వీలైనంత వరకు ఈ వ్యాధులు ఉన్నవారు కొబ్బరి నీటికి దూరంగా ఉండటమే బెటర్. అంతేకాదు కొబ్బరి నీరు తాగకూడదు అనే నియమాలు ఉన్న సమయాల్లో కూడా ఈ నీటిని తాగకపోవడమే బెటర్.