Arvind Kejriwal: కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత. సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది. నిజాయతీగా పాలిస్తే ఎలా ఉంటుంది అంటూ జాతీయ పార్టీలకే చుక్కలు చూపిన నేత. అవినీతి రహిత పాలనకు బ్రాండ్ అంబాజిడర్‌గా ఉన్నాడు. మద్యం వ్యతిరేక ఉద్యమం నడిపాడు. ఇక తక్కువ కాలంలోనే అతని ఇమేజ్ దేశవ్యాప్తమైంది. దీంతో తక్కువ కాలంలోనే తన పార్టీకి జాతీయ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనే విషయంలో ప్రజాభిప్రాయం సేకరించి సంచలనం సృష్టించాడు. ఇలా అనేక సంచలనాలకు కేరాఫ్ అయిన కేజ్రీవాల్.. ఇప్పుడు తన పరపతిని తానే పోగొట్టుకుంటున్నాడు.
ఖలిస్థానివాదులకు మద్దతు..
కేజ్రీవాల్ రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అయితే రైతుల ముసుగులో ఉన్న ఖలిస్థాని వాదులకు కేజ్రీవాల్ మద్దతు తెలుపుడం అప్పట్లో విమర్శలు వచ్చాయి. తర్వాత కేంద్రంపై కోపంతో ఖలిస్థాని ఉద్యమానికి, వేర్పాటు వాద ఉగ్రవాదులకు కేజ్రీవాల్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు.
అవినీతి ఆరోపణలు..
ఇక అవినీతి రహిత పాలనకు చిరునామాగా ఉన్న కేజ్రీవాల్ ఇపుపడు అవినీతి పరుడిగా ఆరోపణలు ఎదుక్కొంటున్నారు. మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్నారు. ప్రభుత్వం అధీనంలోని మద్యం షాపులను ప్రైవేటుపరం చేయడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనే అభియోగం ఎదుక్కొంటున్నారు.
అన్న హజారే స్ఫూర్తికి విరుద్ధంగా..
ఇక కేజ్రీవాల్ గతంలో అవినీతికి, మద్యపానానికి వ్యతిరేకంగా అన్న హజారేతో కలిసి పోరాటం చేశారు. కానీ, ఇప్పుడు అవినీతి, మద్యం అమ్మకాలు పెంచడానికి కృషి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో ప్రజల్లో అతనిపై ఉన్న గౌరవాన్ని తగ్గిచింది.
తాజాగా ఎంపీపై దాడికి మద్దతు..
ఇక తాజాగా తన పార్టీ ఎంపీపై కేజ్రీవాల్ పీఏ దాడిచేశాడు. కడుపులో తన్నాడు. చెప్పలపై కొట్టాడు. జుట్టుపట్టుకుని లాగాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వైద్య పరీక్షల్లో దాడి నిజమే అని తేలింది. అయినా అరవింద్ కేజ్రీవాల్ పీఏకు మద్దతుగా నిలిచారు. దాడి కేసులో పోలీసులు కేజ్రీవాల్ పీఏను అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. మహిళ, ఎంపిపై దాడి జరిగిందని తేలినా కూడా మద్దతు తెలుపడం కేజ్రీవాల్ దిగజారిన తీరును తెలియజేస్తోంది. అదేకాకుండా బీజేపీ కుట్ర చేసిందని, ఆఫీస్ ముట్టడిస్తామని ప్రకటించడం ద్వారా తన ప్రతిష్ట మరింత దిగజారేలా చేసుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.