https://oktelugu.com/

Diabetic Drinks Alcohol: డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం సేవిస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు!

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం తాగవచ్చా.. తాగితే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 1, 2024 / 04:30 AM IST

    Diabetic Drinks Alcohol

    Follow us on

    ఈరోజుల్లో చాలామంది మద్యం తాగుతున్నారు. వయస్సు, జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ సేవిస్తున్నారు. కొందరు పార్టీలు ఉన్నప్పుడు ఏదో లిమిట్‌గా తాగుతుంటారు. కానీ కొందరైతే సమయం సందర్భం లేకుండా ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడతారని తెలిసినా కూడా రోజు తాగుతుంటారు. ముఖ్యంగా మధుమేహం ఉందని తెలిసినా కంట్రోల్ చేసుకోకుండా మద్యం తాగుతారు. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం తాగవచ్చా.. తాగితే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఇవన్నీ పాటించకుండా ఫ్రెండ్స్‌తో పార్టీ లేదా ఏదైనా ఫంక్షన్‌ ఉంటే తాగేస్తారు. మధుమేహం ఉన్నవాళ్లు మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం ఎక్కువగా సేవిస్తే వీళ్లలో కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం, మంటగా ఉండటం, ఏదో గుచ్చినట్లు నొప్పి రావడం వంటివి అన్ని జరుగుతాయి. అలాగే నాడులు దెబ్బతినడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దాదాపుగా 30 శాతం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బాడీ బాగా డ్యామేజ్ అవుతుంది. కిడ్నీలు, లివర్‌ దెబ్బతింటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు తాగడం వల్ల వాళ్లకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు అధికం అవుతుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లు అయితే అస్సలు మందు తాగకూడదు. వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    మధుమేహం ఉన్నవాళ్లు మద్యం తీసుకోవాల్సి వస్తే చాలా తక్కువగా మాత్రమే తీసుకోవాలి. అది కూడా మద్యం తాగిన వెంటనే భోజనం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కొంతవరకు కంట్రోల్‌లో ఉంటాయి. ఎక్కువగా మద్యం సేవించి పూర్తిగా తినకపోతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. దీంతో హైపోగ్లైసీమియాకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం. కానీ అవన్నీ పట్టించుకోకుండా తాగుతుంటారు. మధుమేహం ఉన్నవాళ్లు సరైన సమయానికి ఫుడ్ తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. అప్పుడే డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. మద్యం తాగితే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. దీనివల్ల ఒక్కసారిగా కిడ్నీలు దెబ్బతినడం, మలబద్దకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. రోజూకి సరిపడా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.