https://oktelugu.com/

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా? మీకు సమస్యలు తప్పవు..!

ఇల్లు అందంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల అందమైన ఇంటి కోసం కొన్నివస్తువులను ఇంట్లో ఇంచుతాం. ముఖ్యంగా ఇంటి ముందు అలంకరణ కోసం వాటర్ ఫౌంటేన్ ను ఉండేలా చూస్తాం.

Written By:
  • Srinivas
  • , Updated On : September 1, 2024 / 05:30 AM IST

    Do you have these things at home

    Follow us on

    Vastu Tips: ఉద్యోగం, వ్యాపార ప్రదేశాల్లో ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకోగలుగుతారు. కానీ ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోతే ఎవరూ భరించలేరు. ప్రశాంతమైన ఇంటి కోసం కొందరు ప్రత్యేకంగా ప్రణాళికలు వేస్తుంటారు. ఇందుకోసం కొన్ని వాస్తు టిప్స్ పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం మొదలు పెట్టే సమయంలోనే వాస్తు నిపుణులను సంప్రదిస్తారు. వాస్తు ప్రకారం ఎలా నిర్మించాలి? అనే విషయాలను తెలుసుకుంటారు. అయితే ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించడమే కాదు.. ఇంట్లో ఉన్న వస్తువులను కూడా క్రమ పద్దతిలో ఉంచుకోవాలి. ఇప్పుడే ఇల్లు సంతోషంగా ఉంటుంది. కొందరు అవగాహన లేకుండా వివిధ రకాల వస్తువులు, చిత్రపటాలను తీసుకొస్తూ ఉంటారు. వీటి వల్ల ఇంట్లో ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఫలితంగా ఇంట్లో నిత్యం సమస్యలు వెంటాడుతాయి. అయితే పొరపాటున కూడా ఈవస్తువులు ఇంట్లోకి తీసుకురాకూడదు.. అలాగే వీటిని ఇంట్లోకి పెట్టుకోరాదని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇల్లు అందంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల అందమైన ఇంటి కోసం కొన్నివస్తువులను ఇంట్లో ఇంచుతాం. ముఖ్యంగా ఇంటి ముందు అలంకరణ కోసం వాటర్ ఫౌంటేన్ ను ఉండేలా చూస్తాం. వాటర్ ఫౌంటేన్ ఇంటి ముందు ఉండడం వల్ల ఇంటి పరిసరాలు చల్లటి వాతావరణం ఉంటుంది. అయితే వాటర్ ఫౌంటేన్ ను ఇంట్లోనే నిర్మించుకోవాలి. కొందరు రెడీమేడ్ గా దొరికే వాటిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇలా దీనిని ఇంటికి తీసుకు రావడం వల్ల కష్టాలను తీసుకొచ్చినట్లే అని చెబుతున్నారు. అలాగే నీరు పారే చిత్రాలను కూడా ఇంట్లో ఉంచుకోవద్దని చెబుతున్నారు.

    నాట్యానికి ప్రతిరూపం నటరాజును కీర్తిస్తారు. ఈ అభిమానంతో అయన విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. నటరాజ విగ్రహం ఇంట్లో ఉండడం అంత మంచిద కాదని జ్యోతిష్యలు అభిప్రాయం. కళాకారుల నటరాజ విగ్రహాన్ని అభిమానంతో ఇంట్లో ఉంచుకుంటారు. అయితే ఇది ఇంట్లో ఉండడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. అంతేకాకుండా కొన్ని విధ్వంసాలకు కూడా ఇది కారణంగా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేయొద్దు.

    మొక్కలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి. ఒకప్పుడు ఇంటి చుట్టూ అదనపు ప్లేస్ ఉండడం వల్ల రకరకాల మొక్కలు పెంచుకునేవారు. కానీ ఇప్పుడు నగరీకరణ సందర్భంగా మొక్కలు పెంచుకోవడానికి ఆస్కారం లేదు. అయితే పూల కుండీలు, ఇతర పాత్రల్లో మొక్కలను పెంచుకుంటున్నారు. అయితే పొరపాటున కూడా కాక్టస్ మొక్కను ఇంట్లో పెంచుకోకూడదని అంటున్నారు. ఇది ముళ్లతో కలిగి ఉంటుంది. అందువల్ల ఇంట్లో వాళ్ల మధ్యం నిత్యం ఘర్షణలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగని గులాబీ మొక్కలకు కూడా ముళ్లు ఉంటాయి కదా.. అనుకోవచ్చు. కానీ ఇవి అందమైన పూలు ఇస్తాయి. కాబట్టి గులాబీ మొక్కలను ఉంచుకోవచ్చు.

    గాజు పాత్రలు అందంగా కనిపిస్తాయి.కానీ ఒక్కోసారి ఇవి డ్యామేజ్ అవుతాయి. అయితే సగం పగిలిన గాజు పాత్రలను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదట. ఇంట్లో ఈ వస్తువులు ఉండడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందువల్ల ఇవి ఉంటే వెంటనే బయటపడేయడం మంచిది.