Vatican City: ఈ దేశాల్లో అసలు మసీదులు ఉండవు.. ముస్లింలు ఉండరు

ఇస్లాం. ఈ మతం ఆధారంగా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 24 శాతం ఉంది. అంటే దాదాపుగా 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉంది. ప్రపంచంలో ఇస్లాం మతం రెండో అతిపెద్ద మతం.

Written By: Neelambaram, Updated On : August 31, 2024 1:22 pm

There are no real mosques in these countries

Follow us on

Vatican City: ప్రపంచమంతా వివిధ మతాలు, కులాల వాళ్లు ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో ఉండే దేశాల్లో ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అన్ని దేశాల్లో వివిధ మతాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. తప్పకుండా అన్ని మతాలు ఏదో మూలన ఉండే ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో తొందరగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు మతాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి ఇస్లాం. ఈ మతం ఆధారంగా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 24 శాతం ఉంది. అంటే దాదాపుగా 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉంది. ప్రపంచంలో ఇస్లాం మతం రెండో అతిపెద్ద మతం. అయితే మన దేశంలో కంటే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ముస్లిం వ్యక్తులు అసలు నివసించరు. ఇంతకీ ముస్లింలు నివసించని ఆ దేశాలేవో తెలుసుకుందాం.

ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉండే దేశం వాటికన్ సిటీ. ఇక్కడ కేవలం 800 మంది మాత్రమే ఉంటారు. అయితే ఈ దేశంలో నివసించే ప్రజలు అందరూ క్రైస్తవులు. ఈ సిటీలో అసలు ఒక్క ముస్లిం వ్యక్తి కూడా జీవించరు. క్రైస్తవులకు వాటికన్ సిటీ ఒక పవిత్రమైన స్థలం. మక్కా ముస్లింలకు ఎంత పవిత్ర ప్రదేశమో.. వాటికన్ సిటీ క్రైస్తవులకు అంత పవిత్రం. ఇక్కడ క్రైస్తవ మతం అత్యున్నత మత నాయకుడు పోప్ జీవిస్తున్నారు. అయితే కేవలం వాటికన్ సిటీ మాత్రమే కాకుండా సోలమన్ దీవులు, మొనాకో, ఫాక్‌లాండ్ దీవులు, నియు, టోకెలావ్ దీవులు, గ్రీన్‌లాండ్, కుక్ దీవులల్లో కూడా ముస్లింలు లేరు. ఈ దేశాల్లో ముస్లింల జనాభా సున్నా. అయితే కొన్ని దేశాల్లో మసీదులు లేవు. కానీ ముస్లింలు ఉన్నారు. స్లోవేకియా, ఎస్టోనియా దేశాల్లో ముస్లిం ప్రజలు ఉంటారు. కానీ ఈ దేశాల్లో మసీదులే ఉండవు.

స్లోవేకియాలో 5వేల మంది ముస్లింలు ఉంటే.. ఎస్టోనియాలో 1500 మంది ముస్లింలు జీవిస్తున్నారు. అనేక దేశాల్లో ముస్లింల ప్రార్థన స్థలాలు ఉన్నాయి. కానీ ఈ దేశాలల్లో లేకపోవడంతో ఇక్కడ ప్రజలు మసీదులను నిర్మించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం నిర్మించలేదు. వారి డిమాండ్‌ను తిరస్కరించింది. దీనికి ముఖ్య కారణం ఈ రెండు దేశాల్లో ఇస్లాం మతానికి అధికార హోదా లేదు. అందుకే వాళ్ల డిమాండ్‌ను తిరస్కరించారు. ప్రపంచంలో ముస్లింల జనాభా అత్యధికంగా ఆఫ్రికాలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మారిటానియాలో ఉంది. ఈ దేశంలో మొత్తం జనాభా 47 లక్షలు ఉండగా అందులో 38 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అలాగే సోమాలియా, టర్కీ, ఇరాన్, యెమెన్, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ దేశాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారు.