Animal Fat: తిరుపతి దేవస్థానంలోని లడ్డూలో జంతువుల కొవ్వు ఉండటం అనే వార్త ఏ రేంజ్ లో కలకలం రేపిందో తెలిసిందే. అప్పటి నుంచి ఏది తినాలన్నా కూడా ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ప్రపంచంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము? అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా, మీకు తెలియకుండానే మీరు తినవద్దు అనుకుంట వాటిని మరింత ఎక్కువ తినేస్తున్నారు. మరీ ముఖ్యంగా జంతువుల కొవ్వులకు కూడా ఇది వర్తిస్తుంది అంటున్నారు నిపుణులు.
శాఖాహారులు, మంసాహాసారులు ఇద్దరూ ఉంటారు శాఖాహారులు మాంసం తినడానికి అసలు ఇష్టపడరు. కొంతమంది మాంసం తినేవారు పక్కన ఉంటే కూడా వీరు అసలు అన్నమే తినరు. మాంసం మాత్రమే కాదు, ఏ పదార్థాల్లో అయినా జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినా సరే వీరికి ఆ ఆహారం ముట్టడం కూడా నచ్చదు. అలాంటి ఆహారం కొనుగోలు కూడా చేయరు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఏ పదార్థంలో ఏం కలుపుతున్నారో అని ఇలాంటి శాఖాహారలు, కొందరు మాంసాహారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏ పదార్థాల్లో జంతువులు మాంసం కలుపుతారో తెలుసుకుంటే ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
శాకాహారులు చాలా వరకు జంతువుల కొవ్వులకు దూరంగానే ఉంటారు. మీరు కూడా ఇలాంటి వారే అయితే ఈ జంతువుల కొవ్వును నివారించడానికి ప్రొడక్స్ట్ మీద ఉన్న లేబుల్‌లను జాగ్రత్తగా చదవండి. పందికొవ్వు లేదా టాలో అనే జంతువుల కొవ్వును వివిధ ఆహారాలు, ఉత్పత్తుల్లో కలుపుతున్నారట. ఇలాంటి జంతువుల కొవ్వు ఉన్న ఉత్పత్తులను మనం తెలియకుండానే తినేస్తుంటాం. జంతువుల కొవ్వు, పందికొవ్వును కాయధాన్యాలతో సహా వివిధ ఆహార ఉత్పత్తులలో కలుపుతారు అని అంటున్నారు నిపుణులు. జంతువుల కొవ్వు కలుస్తున్న కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని రకాల వెన్నలో జంతువుల కొవ్వు ఉంటుందట. చాలా బిస్కెట్లు, కుకీలలో జంతువుల కూడా కొవ్వు ఉంటుంది. ముఖ్యంగా బటర్ ఫ్లేవర్డ్ ఫుడ్స్ ను తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. సాసేజ్‌లు, పట్టీలు, మీట్‌బాల్‌లు వంటి మాంసం ఆధారిత ఉత్పత్తుల్లో కూడా తరచుగా జంతువుల కొవ్వు ఉంటుంది అంటున్నారు నిపుణులు.
ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వంటి అనేక ఫాస్ట్ ఫుడ్ వస్తువుల్లో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్నారట. రుచిని మెరుగుపరచడానికి కొన్ని సూప్‌లు, స్టాక్‌ల్లో కూడా జంతువుల కొవ్వును కలుపుతున్నారట. కొన్ని రకాల జున్ను, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన చీజ్‌లలో జంతువుల కొవ్వు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని చాక్లెట్లకు మంచి ఆకృతి రావడం కోసం కూడా జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారట. కొన్ని సిద్ధం చేసిన ఘనీభవించిన ఆహారాలలో కూడా ఈ జంతువుల కొవ్వు కలుస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.