Sri Lanka Prime Minister : శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా అసుర కుమార దిస నాయకే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొత్త ప్రధానమంత్రిగా హరిణి అమర సూర్యును నియమించారు. హరిణి అమరసూర్య శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ స్టడీస్ విభాగంలో సీనియర్ లెక్చరర్ గా కొనసాగుతున్నారు. 2020లో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె అక్కడి పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. దిస నాయకే అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత.. హరిణి అమర సూర్యను ప్రధానమంత్రిగా నియమించారు. ఆమె ప్రధాన మంత్రిగా ఉంటూనే న్యాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, పరిశ్రమల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. హరిణి శ్రీలంక 16వ ప్రధానమంత్రిగా.. మూడవ మహిళ ప్రధానమంత్రిగా పేరుగాంచారు. హరిణి స్వేచ్ఛాయుత భావజాలాన్ని కలిగిన మహిళగా పేరుపొందారు. లింగ అసమానతలు, శిశు సంరక్షణ, విద్యావ్యవస్థ పరిరక్షణ, నిరుద్యోగ నివారణ వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగించారు. అనంతరం ఆయా రంగాల్లో తీసుకోవాల్సిన మార్పులు, చేపట్టాల్సిన సంస్కరణలను ఒక నివేదిక ద్వారా వెల్లడించారు. ఆమె చేసిన సూచనలు.. విన్నవించిన మార్పులు దేశంలో మెజారిటీ ప్రజలకు నచ్చాయి. దీంతో ఆమె చేసిన పరిశోధన పలువురి ప్రశంసలు అందుకుంది..గత శనివారం శ్రీలంకలో దేశ అధ్యక్ష నియామకానికి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దిస అలాగే విజయం సాధించారు.
అందుకోసమే నియమించారా?
శ్రీలంక దేశంలో మహిళలు ప్రధాన మంత్రులు కావడం కొత్త కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో ఒక మహిళను ప్రధానమంత్రిగా నియమించడం గొప్ప విషయమని అక్కడి రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.. హరిణి ఉన్నత విద్యావంతురాలు కావడంతో దేశంలో సమస్యలను పరిష్కరించే సమర్థత ఉంటుందని కొత్త అధ్యక్షుడు దిస నాయకే భావించి.. ఆమెకు ప్రధానమంత్రి పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. గతంలో చైనాతో అంటకాగిన శ్రీలంక ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలోనే విదేశాంగ విధానంపై కొత్త అధ్యక్షుడు దిస నాయకే ఒక స్పష్టత ఇచ్చాడు..” మేము చైనా తో ప్రయాణించలేం. భారత్ తో కొనసాగలేం. తటస్థ వైఖరి కొనసాగిస్తాం.. మా దేశ ప్రయోజనాలు మాకు చాలా ముఖ్యం. ఒకరికి వంత పాడాల్సిన అవసరం లేదు. విదేశాంగ విధానంలో స్పష్టంగా ఉన్నామని” దిస నాయకే వ్యాఖ్యానించాడు.
హరిణి ఏమంటున్నారంటే..
మరోవైపు కొత్త ప్రధానమంత్రిగా నియమితులైన తర్వాత హరిణి తన ఉద్దేశాన్ని వివరించారు. ” శ్రీలంక ను అని రంగాలలో ముందు వరుసలో నిలపాలనేదే మా తాపత్రయం. విదేశాంగ విధానంలో ఒక స్పష్టత తో ఉన్నాం. ప్రజల మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి సందర్భంలో సమర్థవంతమైన పరిపాలన అందించాలి. మా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ మేము ఎదుర్కొంటామని” హరిణి పేర్కొన్నారు. హరిణి ప్రధానమంత్రి అయిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక తో సన్నిహిత సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని మోడీ వ్యాఖ్యానించారు.
&
Dr. Harini Amarasuriya, a prominent academic and rights activist, has been appointed as the new Prime Minister of Sri Lanka @Dr_HariniA
pic.twitter.com/R60TYqIwZc— Varun (@varunmayu) September 24, 2024