World Pharmacists Day : ఆరోగ్యం నిలకడగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్తుంటాం. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోతే ఫార్మసిస్ట్‌ను ఆశ్రయిస్తాం. ఉదాహరణకు జలుబు, దగ్గు, జ్వరం, ఇలా ఎవైనా చిన్న సమస్యలు ఆలస్యం చేయకుండా ఫార్మసిస్ట్ దగ్గరకు వెళ్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఫార్మాసిస్ట్‌లు ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఎంతో మంది ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి కాపాడతారు. ఇలాంటి వారికి గుర్తింపు ఇస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మెరుగుపర్చడంలో అవగాహన కల్పించాలని ప్రతీ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఫార్మసిస్ట్‌లు చేసే సాయానికి గుర్తింపుగా ఈ రోజును ప్రతి ఫార్మసిస్ట్‌లకు అంకితం చేస్తారు. ఈ వృత్తిలో వారు ఇంకా ఎంతో మంది ప్రజలను కాపాడుతూ.. ఇతరులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ డేను జరుపుకుంటారు.
దీని చరిత్ర?
టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2000 సంవత్సరంలో జరిగిన ఒక సమావేశంలో ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవాన్ని ప్రారంభించాలని అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ నిర్ణయించుకుంది. దీంతో 2009 సెప్టెంబర్ 25న దీనిని ప్రారంభించారు. రోజురోజుకి వైద్య రంగంలో అభివృద్ధి చెందుతున్న ఫార్మసిస్ట్‌ల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించారు.
ఈ ఏడాది థీమ్
ప్రపంచ ఫార్మాసిస్ట్‌ల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ ఏడాది ఫార్మసిస్ట్స్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్ (ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడం) అనే థీమ్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఫార్మసిస్ట్‌లు ఎక్కువ రోజులు పనిచేస్తారని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు. వాళ్లకి ఇవ్వాలసిన గౌరవం ఇస్తూ వీరి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రపంచ వ్యాప్తంగా ఫార్మసిస్ట్‌ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
కోవిడ్ సమయంలో..
కరోనా సమయంలో ఫార్మసిస్ట్‌లు చేసిన మాటల్లో చెప్పలేనిది. వెన్నెముక ఎంత ముఖ్యమో.. ఫార్మసిస్ట్‌లు కూడా కరోనా సమయంలో ప్రజలకు ఒక బ్యాక్ బోన్‌లా వ్యవహరించారు. ఈ క్రమంలో ఎంతో మంది ఫార్మాసిస్ట్‌లు వారి ప్రాణాలకు పొగోట్టుకున్నారు. అయిన ప్రజలకు మందులు, టీకాలు అంటూ సాయం చేశారు. డాక్టర్లతో పాటు ఫార్మసిస్ట్‌లు కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉంటూ ప్రజలకు చేసిన సాయం ఎవరూ మర్చిపోరు. ప్రమాదంలో పడతామని తెలిసి వారి కుటుంబాలను వదిలి ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడారు.
ఫార్మాసిస్ట్‌ల దినోత్సవం ఎలా జరుపుకోవాలంటే?
ఈరోజున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అన్ని ఫార్మసీలలో ఫార్మసిస్ట్‌ల గురించి పూర్తిగా వివరిస్తూ వారి వృత్తి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఫార్మసిస్ట్‌లు ఒక చిన్న తప్పు చేసిన ప్రజల ప్రాణాలు పోతాయి. ఒక మెడిసిన్‌కి బదులు వేరే మెడిసిన్ ఇస్తే.. ప్రమాదమే. డబ్బు కోసం ఇలా తప్పుడు పనులు చేయకుండా వృత్తికి గౌరవించాలనే అవగాహన కల్పించాలి. సోషల్ మీడియాలో కూడా వీటి ప్రాముఖ్యతను పెంచండి. కార్యక్రమాలకు వెళ్లే సమయం లేకపోతే వర్చువల్‌గా ఈవెంట్‌లకు వెళ్లండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ.. ఫార్మాసిస్ట్‌లు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.