https://oktelugu.com/

Akhanda Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ “అఖండ” చిత్రం…

Akhanda Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా ‘అఖండ’. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ఇది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ పోషించారు. జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  ‘అఖండ’ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 21, 2021 / 03:06 PM IST
    Follow us on

    Akhanda Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా ‘అఖండ’. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ఇది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ పోషించారు. జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  ‘అఖండ’ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.

    అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి  యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా బావుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇటీవల విడుదలైన ‘అఖండ‘ టైటిల్ సాంగ్‌ అభిమానుల్ని ఫుల్ గా ఆకట్టుకుంటుంది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన ఇద్దరు కుమారులు సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ కలిసి ఈ  పాట పాడటం మరో  ప్రత్యేక విషయం అని చెప్పాలి.

    https://twitter.com/dwarakacreation/status/1462291240876011523?s=20

    బాలకృష్ణ ఒక వైపు  సినిమాలు మరో వైపు ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య ఓ టాక్​ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే పేరుతో నడుస్తున్న ఈ షోకు బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య  107 వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.