Diabetes: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలతో షుగర్ ఒకటని చెప్పవచ్చు. గతంలో వృద్ధులలో ఎక్కువమందిలో ఈ సమస్య కనిపించగా ప్రస్తుతం 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు సైతం షుగర్ తో బాధ పడుతున్నారు. పిల్లల్లో చాలామందిని టైప్ 1 డయాబెటిస్ సమస్య వేధిస్తోంది. అయితే పనసతో డయాబెటిస్ కు చెక్ చెప్పవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పనసకాయ పిండితో షుగర్ లెవెల్స్ ను సులభంగా తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. షుగర్ తో బాధ పడుతున్న 40 మంది రోగులపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు గోధుమ పిండితో పనస పిండిని కలిపి తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. డయాబెటిస్ రోగులకు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడంలో పనస పిండి సహాయపడుతుంది.
బరువు తగ్గకుండానే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సూపర్ మార్కెట్ల ద్వారా లేదా ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారా ఈ పిండిని కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. షుగర్ తో బాధ పడేవాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయనే విషయం తెలిసిందే. డయాబెటిస్ బారిన పడకుండా ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.
ఒకసారి షుగర్ బారిన పడితే తర్వాత కాలంలో జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంది. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం సాధ్యమవుతుంది.