APSFC Recruitment 2021: ఏపీలో ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

APSFC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 23 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 23 […]

Written By: Navya, Updated On : September 17, 2021 10:05 am
Follow us on

APSFC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 23 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 23 ఉద్యోగ ఖాళీలలో మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా డిప్యూటీ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 3, అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు 11 ఉన్నాయి. 2021 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఏ, సీ.ఎం.ఏ, బీటెక్ అర్హతతో ఎంబీఏ, పీజీడీఎం, కమర్షియల్ లా, పీజీ డిగ్రీ లా ఇన్ బిజినెస్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీసీ, జనరల్ అభ్యర్థులకు 1,003 రూపాయలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 590 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 10వ తేదీలోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

https://esfc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి.