
ప్రధాని మోదీ వల్లే దేశం అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాడేపల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. చైనా తరువాత భారత దేశంలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ను శాస్త్రవేత్తలు కనిపెట్టడానికి మనో ధైర్యాన్ని మోదీ కల్పించారని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వివిధ రకాల ఔషధాలు, ఉత్ప్రేరకాలు, దేశంలోనే తయారు చేసే విధంగా ఫార్మాసిటి కంపెనీలకు ప్రోత్సహాన్నిచారన్నారు. కరోనా సమయంలో ఏ పరిశ్రమ అయినా కుంటిపడింది తప్ప, వ్యవసాయ రంగం మాత్రం తమ ఉత్పత్తులను కొనసాగించి ప్రపంచ దేశాలకు ఎగుమతులు అయ్యాయని తెలిపారు.