ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నిజమేనని నమ్ముతున్నారు. అలా నమ్మడమే కాకుండా ఆ వార్తల గురించి ఇతరులకు సైతం చెప్పి ఆ వార్తలు ప్రచారం అయ్యేలా చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఒకే బ్లడ్ గ్రూప్ వాళ్లు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరని.. పుట్టినా అయవలోపాలతో పుడతారని ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న ఈ ప్రచారం గురించి వైద్యులు, శాస్త్రవేత్తలు స్పందించి వివరణ ఇచ్చారు.
Also Read: చిప్స్ ఎక్కువగా తింటున్నారా.. ఆ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?
ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న భార్యాభర్తల వల్ల పుట్టబోయే పిల్లల్లో సమస్యలు రావని చెప్పారు. మేనరికం వివాహాలు చేసుకున్న వాళ్లలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. రక్త సంబంధీకులను పెళ్లి చేసుకున్నా ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. సాధారణ పిల్లలతో పోలిస్తే మేనరికం, రక్తసంబంధీకుల పిల్లల్లో 2 నుంచి 3 శాతం వరకు జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
Also Read: కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
రక్త సంబంధీకులలోని జన్యువులలో సమస్యలు ఉంటే పుట్టే పిల్లల్లో సైతం సమస్యలు వస్తాయని జెనిటిక్ సమస్యలు ఉంటే మాత్రం జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. టిఫ్ఫా స్కాన్, ట్రిపుల్ మార్కర్ లేదా క్వాట్రపుల్ టెస్ట్ ద్వారా ఆరోగ్య సమస్యల గురించి ముందే తెలుసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. కొన్ని సమస్యలు మాత్రం పిల్లలు పుట్టిన తరువాతే తెలుస్తాయని చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
ఒకే బ్లడ్ గ్రూప్ అయినంత మాత్రాన పిల్లల్లో లోపాలు ఉంటాయని కంగారు పడవద్దని సూచనలు చేస్తున్నారు. అనవసర భయాందోళనలు ఉంటే వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.