అయోధ్య శ్రీరాముడితో బీజేపీ మరో సంచలనం

కేంద్రంలోని మోడీ, అమిత్ షాలో అంతో ఇంతో సెక్యులర్ భావజాలాన్ని దేశంలో అవలంభిస్తారు. కానీ యూపీలో కొలువుదీరిన యోగి ఆధిత్యనాథ్ సహజంగానే ఒక యోగి కావడంతో ఆయన పక్కా కరుడుగట్టిన హిందుత్వవాదిలో మసులుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయం నిర్మాణం కొనసాగుతుండగా మరో సంచలనానికి యోగి నాంది పలికారు. Also Read: న్యాయవ్యవస్థపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు తాజాగా యూపీలోని అయోధ్య ఎయిర్ పోర్టుకు ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయం’ పేరు పెట్టాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. […]

Written By: NARESH, Updated On : November 26, 2020 10:46 am
Follow us on

కేంద్రంలోని మోడీ, అమిత్ షాలో అంతో ఇంతో సెక్యులర్ భావజాలాన్ని దేశంలో అవలంభిస్తారు. కానీ యూపీలో కొలువుదీరిన యోగి ఆధిత్యనాథ్ సహజంగానే ఒక యోగి కావడంతో ఆయన పక్కా కరుడుగట్టిన హిందుత్వవాదిలో మసులుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయం నిర్మాణం కొనసాగుతుండగా మరో సంచలనానికి యోగి నాంది పలికారు.

Also Read: న్యాయవ్యవస్థపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

తాజాగా యూపీలోని అయోధ్య ఎయిర్ పోర్టుకు ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయం’ పేరు పెట్టాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం, విమానయాన శాఖ ఆమోదిస్తే ఈ కొత్త పేరు వాడుకలోకి రానుంది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడంతో యూపీలోని యోగి సర్కార్ ఏకంగా ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్టుకు ‘శ్రీరాముడి’ పేరు కలిసి వచ్చేలా నామకరణం చేయాలని సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కొలువైన బీజేపీ ప్రభుత్వం తాజాగా అక్కడి ‘అయోధ్య ఎయిర్ పోర్టు’ పేరు మార్చాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి, విమానయాన శాఖకు లేఖ పంపించింది.

Also Read: టీఆర్ఎస్ వ్యూహానికి బీజేపీ సెల్ఫ్ గోల్..!

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ పేర్ల ఒరవడి పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అయోధ్య రాముడు కొలువైన చోట కూడా ఎయిర్ పోర్టు పేరు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.