తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ నేతల కొట్లాటపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బహిరంగంగా వీరిద్దరూ వాగ్వాదం చేసుకోవడంతో వైసీపీ పరువు పోయింది. అధికార పార్టీలో ఉండి ఇలా రచ్చకెక్కిన వీరిద్దని పిలిపించి సీఎం జగన్ క్లాస్ పీకినట్టు సమాచారం.
కాకినాడ డీఆర్సీ సమావేశంలో అలా బహిరంగంగా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడానికి కారణం ఏంటని జగన్ వాకబు చేసినట్టు తెలిసింది. పరువు పోయేలా చేయవద్దని నేతలకు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉంటూ బహిరంగంగా గొడవపడ్డ ఇద్దరు నేతలపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలిసింది. కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతలు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాగ్వాదం పార్టీ పరువు పోయేలా చేసింది. దీనిపై సీరియస్ అయిన సీఎం జగన్ ఆ ఇద్దరు ఎంపీ, ఎమ్మెల్యేలను తనను కలవాలంటూ కబురు పంపినట్టు తెలిసింది.
దీంతో ఇద్దరూ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వారిని రప్పించారు. ఇద్దరినీ వివరణ కోరిన సీఎం జగన్ డీఆర్సీ సమావేశంలో రచ్చపై ఇరువురు నేతల వివరణ తీసుకున్నట్టు తెలిసింది.
అయితే ఈ భేటిపై ఎంపీ పిల్లి సుభాష్ కానీ.. ఇటు ద్వారంపూడి కానీ ఇప్పటిదాకా స్పందించలేదు.