Dates For Diabetes: షుగర్ వ్యాధినే మధుమేహం అంటారు. ఇది సోకిన వారిని మధుమేహులు అని పిలుస్తారు. ప్రస్తుత కాలంలో వారి సంఖ్య రెట్టింపవుతోంది. షుగర్ కు మన తెలంగాణ రాజధానిగా మారుతోంది. ప్రపంచంలో ఎక్కువ మధుమేహులు ఇండియా, చైనాల్లోనే ఉండటం గమనార్హం. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో ప్రజలు అన్నం ఎక్కువగా తినడం వల్లే ఈ అనర్థం. అయినా అన్నాన్ని మానలేకపోతున్నారు. షుగర్ ఎంత విస్తరిస్తున్నా ఎవరు కూడా జాగ్రత్తలు పాటించడం లేదు. ఫలితంగా మధుమేహులు పెరుగుతున్నారు. వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేహాన్ని పలు బాధలకు గురిచేసే మధుమేహం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
మధుమేహులు పరిమిత ఆహారాలనే తీసుకోవాలి. తీపి పదార్థాలు తినకూడదు. అరటి, సీతాఫలం, సపోట, మామిడి వంటి పండ్లు తినకూడదు. జామ, బొప్పాయి, దానిమ్మ, ఆపిల్, నేరేడు, నల్ల ద్రాక్ష వంటి పండ్లు తినొచ్చు. ఇంకా ఖర్జూరాలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే పరిమితంగా తీసుకోవాలి. అంతేకాని దొరికాయి కదాని ఎక్కువ తినకూడదు. ఖర్జూరాల్లో ఉండే పోషకాలతో షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. తియ్యదనంగా ఉండే పండ్లను తీసుకోకూడదనే ఉద్దేశంతో ఖర్జూరాలను కూడా దూరం పెడుతున్నారు.
ఖర్జూరాల్లో ఉండే మెగ్నిషియం ఉన్నందున ఎముకలు బలంగా మారడానికి సాయపడుతుంది. ఖర్జూరాల్లో ఉండే ఐరన్ కంటెంట్ ఎముకలు బలంగా చేయడానికి దోహదపడుతుంది. మధుమేహులు వీటిని లిమిట్ లో తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా తింటే అనర్థమే. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ప్రమాదకరమైన క్యాన్సర్లను దూరం చేస్తాయి. తీపి పదార్థాలు తినాలనే కోరిక ఉన్న మధుమేహులు ఖర్జూరాలు రెండు మూడు తింటే సరిపోతుంది.
మధుమేహం ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. షుగర్ పేషెంట్లు ఖర్జూరాలు తినకూడదని కొందరు చెబుతుంటారు. కానీ పరిమితంగా తినొచ్చు. ఖర్జూరాలతో రక్తంలో చక్కెర అదుపులోనే ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఖర్జూరాలను తమ ఆహారంలో భాగంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఖర్జూరాలను తిని మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే విధంగా తీసుకుని ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.