Homeఆంధ్రప్రదేశ్‌Jagan: కేసీఆర్‌ను ఫాలో అవుతున్న జగన్‌.. ఒకే సమయంలో సీఎంలుగా, ప్రతిపక్ష నేతలుగా.. కానీ ఆ...

Jagan: కేసీఆర్‌ను ఫాలో అవుతున్న జగన్‌.. ఒకే సమయంలో సీఎంలుగా, ప్రతిపక్ష నేతలుగా.. కానీ ఆ విషయంలో రాగ్‌ స్టెప్‌!

Jagan: తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌.జగన్‌. ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సమయంలో సీఎంలుగా పనిచేశారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే సమయంలో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. సీఎంలుగా ఇద్దరు అనేకసార్లు సమావేశం కూడా అయ్యారు. ఇద్దకీ వయసులో తేడా ఉన్నా.. అచ్చం అన్నదమ్ముల్లానే సహకారం అందించుకున్నారు. ఇక ఇద్దరి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. సీఎంలుగా ఉన్న సమయంలో ఇద్దరూ తమ రాజప్రసాదాలను దాటి బయటకు రాలేదు. ఇద్దరూ జనాలకు పార్టీ జనాలకు దూరంగా ఉన్నారు. ఇద్దరినీ కలవడం మంత్రులు, ఎమ్మెల్యేలకు అంత ఈజీగా ఉండేది కాదు. నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇద్దరూ ఒకేలా ఉంటారు. తమకు తట్టిన ఆలోచనలతోనే ముందుకు సాగుతారు. ఎవరి సలహాలు తీసుకోరు. సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చిన కేసీఆర్‌ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీ అధినేత సగం మంది టికెట్లు మార్చినా.. ఓటమి నుంచి తప్పించుకోలేదు.

ప్రతిపక్షానికి పరిమితం..
ఇక ఇద్దరూ ఓకేసారి ఓడిపోయారు. ఇద్దరూ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మంచి పాత్ర పోషించాలి. కానీ, తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా ఏడాదిగా గడుపుతున్నారు. ఆయన తరఫున ఎమ్మెల్యేలు సభకు వెళ్తున్నారు. ఇక జగన్‌ కూడా కేసీఆర్‌ను ఫాలో అవుతన్నారు. ఆరు నెలల్లో రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కొద్ది గంటలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. మూడోసారి బడ్జెట్‌ సెషన్స్‌ జరగబోతున్నాయి. అసెంబ్లీకి రానని జగన్‌ మీడియా ముఖంగా చెప్పేశారు.

చంద్రబాబు కూడా..
2019 ఏపీ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు అసెంబ్లీకి మూడేళ్లు వచ్చారు. అదే విధంగా గతంలో తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజయ్యారు. కానీ జగన్‌ సభకు దూరంగా ఉంటానని చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే రావడం లేదంటున్నారు. సభకు వెళితే తనను కార్నర్‌ చేస్తారన్న ఆలోచనతో జగన్‌ సభకు వెళ్లడానికి భయపడుతున్నారని తెలుస్తోంది. సభకు వెళితేనే అటు కేసీఆర్‌కు, ఇటు జగన్‌కు మేలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా అడ్వాంటేజ్‌ అవుతుందని సూచిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిలదదీసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రజల మద్దతు పొందవచ్చని అంటున్నారు. ప్రభుత్వం కార్నర్‌ చేస్తే ప్రజల్లో సానుభూతి కూడా వస్తుందని సూచిస్తున్నారు. సభకు వెళ్లకుంటే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది.

ఈ విఫయంలో కేసీఆర్‌ను ఫాలో అవొద్దు..
అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం విషయంలో కేసీఆర్‌ను ఫాలో కావడం మంచిది కాదంటున్నారు. కేసీఆర్‌ తెలంగాణకు రెండుసార్లు సీఎంగా పినిచేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆయన వారసులు సీఎం అవుతారు. దీంతో కేసీఆర్‌ వెళ్లకుండా హరీశ్‌రావు, కేటీఆర్‌ను సభకు పంపుతున్నారు. దీంతో వారు అడ్వాంటేజ్‌ పొందుతున్నారు. అయితే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది జగనే. ఆయన సభకువెళ్లకుండా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఆయన అసెంబ్లీకి వెళ్లడం చాలా ముఖ్యం. బడ్జెట్‌ సెషన్స్‌కు వెళ్లడం చాలా ముఖ్యం. మరి ఈవిషయంపై ఆయనకు ఎవరైనా సలహా ఇస్తారో.. లేక ఆయనే పునరాలోచిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular