UK: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాలు దొరకడం లేదు. ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ఇక కొత్తగా రిక్రూట్ చేసుకునేవారి వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఐఐటీల్లో చదివిన వారికి కూడా వేతనాలు అంతంతే ఇస్తున్నాయి. దీంతో చాలా మంది తమ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో బ్రిటన్‌లోని భారతీయ యువతి తాజాగా లింక్డ్‌ఇన్‌లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులో ఏముందంటే.. ఒక్క జాబ్ ఇవ్వడి ప్లీజ్.. జీతం లేకపోయినా పరవాలేదు అని ఉంది. వీసా స్పాన్సర్ చేసే జాబ్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. మరో మూడు నెలల్లో తన గ్రాడ్యుయుట్ వీసా కాలపరిమితి ముగిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 300 జాబ్స్‌కు దరఖాస్తు చేశానని, ఒక్కటీ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరో దారిలేక పోస్టు పెడుతున్నట్లు వెల్లడించింది.
ఫ్రీగా పనిచేస్తా..
ఇంకా ఈ పోస్టులో.. నేను ఫ్రీగా పనిచేస్తా.. శాలరీ ఇవ్వకున్నా రోజుకు 12 గంటలు పనిచేయడానికి రెడీగా ఉన్నాను. వారానికి ఏడు రోజులు పనిచేస్తా.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోను. కనీసం ఒక నెల రోజులు జాబ్ ఇచ్చి చూడండి. నా పనితీరు నచ్చకపోతే అప్పటికప్పుడు జాబ్ నుంచి తొలగించండి అని అభ్యర్థించింది. 2021లో తాను గ్రాడ్యుయుషన్ కోసం బ్రిటన్‌కు వచ్చానని, గతేడా ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ జాబ్ మార్కెట్ చూస్తుంటే నా చదువుకు, నైపుణ్యాలకు డిగ్రీకి అసలు విలువ లేనట్లు ఉందని వాపోయింది. బ్రిటన్‌లో పనిచేసేందుకు ఇదే తనకు చివరి ఛాన్స్ అని పేర్కొంది.
భిన్నాభిప్రాయాలు..
యువతి పోస్టుపై నెటిజన్లు భిన్యాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జాబ్ కోసం ఇలా కాళ్లావేళ్లా పడడం ఇండియన్స్‌పై చెడు అభిప్రాయం కలిగిస్తుందని, ఇతరులకు కూడా ఇది చేటుచేస్తుందని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. బ్రిటన్‌లో ఉద్యోగం సాధించడం విదేశీయులకు ఎంత కష్టమో ఈ పోస్టు చెబుతుంది అని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఈసారి ఆమెకు జాబ్ దొరకకపోతే భారీ లోన్ భారంతో ఇండియాకు తిరిగి వెళ్లాలి అని మరొకరు పేర్కొన్నాడు. ఇలా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
2021లో గ్రాడ్యుయేట్ వీసా..
ఇదిలా ఉంటే బ్రిటన్ గ్రాడ్యుయేట్ వీసాను 2021లోనే ప్రవేశపెట్టింది. దీని ప్రకారం డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు మరో రెండేళ్లు అదనంగా ఉండొచ్చు. పీహెచ్‌డీ చేసిన వారు మూడేళ్లు ఉండి జాబ్ వెతుక్కునేందుకు అవకాశం ఉంది. కానీ గడువులోగా జాబ్ రాకపోతే సొంద దేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. ఈ నిబంధన మేరకు తాజాగా యువతి వేడుకుంటోంది. మరి ఎవరైనా స్పందిస్తారో.. లేదో చూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Give me a job if you work for free indian young woman in uk pleads
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com