Sajjala Ramakrishna Reddy : తెలివైనవాడు ఎప్పుడూ తెలివిగానే ఆలోచిస్తాడు.తాను సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తాడు.సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది అదే.సకల శాఖా మంత్రిగా,ముఖ్యమంత్రికి సలహాదారుడుగా వ్యవహరించారు. ప్రభుత్వంతోపాటు వైసీపీలో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు. ఎంతో మంది నేతలు ఉన్న వారందరినీ అధిగమించి నెంబర్ 2 స్థానానికి చేరుకున్నారు. గత ఐదు సంవత్సరాలు తిరుగులేని అధికార దర్పాన్ని ప్రదర్శించారు.తన మాట నెగ్గించుకున్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు కంటే తానే అధికమని నిరూపించారు. రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారు.పార్టీని,పార్టీ అధినేతను, ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకొని తిరుగులేని అధికారాన్ని వెలగబెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి వారు. తాను ఒక్కడినే కాదు తన కుమారుడికి కూడా కీలకమైన పదవి ఇప్పించారు. పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించారు. గత ఐదేళ్లపాటు వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు పరిస్థితి సాగింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదవుతున్నాయి. కానీ ఆ విభాగానికి ఇంచార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి మాత్రం తప్పించుకున్నారు.ఆయన పురమాయించిన వారు మాత్రం కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
* అత్యంత పవర్ ఫుల్
వైసీపీలో సోషల్ మీడియా విభాగం అత్యంత పవర్ ఫుల్. పార్టీ ఆవిర్భావం నుంచి సక్సెస్ వెనుక సోషల్ మీడియా విభాగం కృషి ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. క్రమేపి తాడేపల్లి ప్యాలెస్ లో తన ముద్రను చాటుకున్నారు. అప్పటివరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలను అధిగమించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవితో పూర్తిస్థాయి పట్టు సాధించారు. వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలను తన కుమారుడు భార్గవ రెడ్డికి ఇప్పించుకోగలిగారు.గత ఐదేళ్లపాటు సేవలందించారు భార్గవరెడ్డి.
* ఆ కీచకత్వానికి నాయకత్వం
గత ఐదేళ్లపాటు వైసీపీ సోషల్ మీడియా ఇష్టానుసారంగా రెచ్చిపోయింది.ప్రత్యర్థుల ఇంట్లో మహిళలను సైతం బయటకు లాగింది.ఇటీవల అదే విషయాన్ని ప్రస్తావించారు డిప్యూటీ సీఎం పవన్.సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి తన పిల్లలు రోదించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.అందుకే పవన్ వ్యాఖ్యలతో ఏపీ పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్ లోకి దిగింది.అయితే గత ఐదేళ్లపాటు ఈ వైసీపీ సోషల్ మీడియా అరాచకానికి నాయకత్వం వహించిన సజ్జల భార్గవ్ రెడ్డి మాత్రం ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాత్మకంగా తన కుమారుడికి ఆ బాధ్యతల నుంచి తప్పించారు. సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లారు.అయినా సరే సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Predictably sajjala ramakrishna reddy strategically left his son in charge of ycp social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com