కరోనా వైరస్ విజృంభణ వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారికి విరుగుడు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా లక్షల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. భారత్ లో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.
Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి చాలా డేంజర్..?
పలు వ్యాక్సిన్లు ఇప్పటికే తుది దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు కరోనాకు చెక్ పెట్టే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. గ్రీన్ టీ, మస్కాడిన్ ద్రాక్ష, డార్క్ చాక్లెట్స్ కరోనాకు చెక్ పెడతాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
Also Read: వారికి కరోనా సోకదు.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..?
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా వీటి ద్వారా కరోనాకు చెక్ పెట్టడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక అధ్యయనం ద్వారా డార్క్ చాక్లెట్స్, గ్రీన్ టీ, మస్కాడిన్ ద్రాక్ష కరోనా వైరస్ యొక్క ప్రోటీన్, ఎంజైమ్ పనితీరుపై ప్రభావం చూపుతోందని కరోనా వైరస్ ఎంజైమ్ లేదా ప్రోటీన్ పనితీరును నిరోధిస్తే వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
డార్క్ చాక్లెట్స్, గ్రీన్ టీ, మస్కడిన్ ద్రాక్ష లో ఉండే కెమికల్ కాంపౌండ్ లు వైరస్ కు చెక్ పెట్టినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంజైమ్ పనితీరు నిరోధించడం ద్వారా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫ్రాంటియర్స్ ఇన్‌ప్లాంట్ సైన్స్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.