జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేడు సంపూర్ణంగా ముగిసింది. రేపటి కౌంటింగ్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కానుంది. బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద పోలీస్ ఆంక్షలు విధించడంతోపాటు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: గ్రేటర్ లో ‘టీఆర్ఎస్’ కే పట్టం.. ఎందుకు?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓల్డ్ మలక్ పేట డివిజన్లో సీపీఎం.. సీపీఐ గుర్తులు తారుమారు కావడంతో నేడు ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలోని ఝాన్సీ బజార్.. పురానాపూల్ డివిజన్లలో ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడిందని.. ఈ రెండు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్ఎంసీ పరిధిలోని ఝాన్సీ బజార్.. పురానాపూల్ డివిజన్లలో తిరిగి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీ)కి సూచించింది. అయితే శుక్రవారమే కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈ రెండు డివిజన్లలో రీ పోలింగ్ అంశంపై ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.
Also Read: జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్: ఏ పార్టీ గెలుస్తుందంటే?
ఇక జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ నేటి సాయంత్రం 6గంటలకే ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ సర్వేలన్నింట్లోనూ టీఆర్ఎస్ కే గ్రేటర్ పీఠం దక్కుతాయని స్ఫష్టం చేస్తున్నాయి. కాగా ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల్లో.. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో విడుదలైన ఎగ్జిట్స్ పోల్స్ మాత్రం ఫెయిలయ్యాయి. దీంతో ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ ఏమేరకు కరెక్ట్ అవుతాయో రేపటి ఫలితాలతో తేలనుంది. ఎగ్జిట్స్ పోల్స్ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్