Homeహెల్త్‌Daily protein requirement: శరీరానికి రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం.. ఇది ఎలా లభిస్తుంది..

Daily protein requirement: శరీరానికి రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం.. ఇది ఎలా లభిస్తుంది..

Daily protein requirement: మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనంగా కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే ఇందులో ప్రోటీన్లు ఉండడం చాలా అవసరం. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు సుమారు 70 నుంచి 80 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ప్రొటీన్ మన కండరాల నిర్మాణానికి మాత్రమే కాదు.. హార్మోన్లు, ఎంజైమ్స్ తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇది ప్రతి ఒక్కరి డైట్‌లో తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ ప్రోటీన్ ను ఎలాంటి ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు?

ప్రోటీన్స్ అనగానే చాలా మంది మాంసం తీసుకోవాలని అనుకుంటారు. కానీ శాకాహారులు కూడా సులభంగా ప్రొటీన్ అవసరాన్ని తీర్చుకోవచ్చు. పప్పులు, సోయా, పనీర్, గ్రీక్ యోగర్ట్, బాదం వంటి ఆహారాలు మంచి ప్రొటీన్ సోర్స్‌లు. ఇవి కేవలం ప్రొటీన్ మాత్రమే కాదు, ఫైబర్, కాల్షియం, మంచి కొవ్వులు కూడా అందిస్తాయి. రోజువారీ భోజనంలో ఇవి చేర్చుకుంటే శరీరానికి సమతుల ఆహారం అందుతుంది.

మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్ బ్రెస్ట్, చేపలు వంటి ఆహారాల ద్వారా అధిక ప్రొటీన్ పొందొచ్చు. ముఖ్యంగా గుడ్లు ‘కంప్లీట్ ప్రొటీన్’గా భావిస్తారు, ఎందుకంటే ఇవి అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటాయి. చికెన్ బ్రెస్ట్, చేపలు తక్కువ కొవ్వుతో ఎక్కువ ప్రొటీన్ అందిస్తాయి, కాబట్టి ఫిట్‌నెస్‌కు ఇవి చాలా ఉపయోగకరం.

ఎలాంటి ప్రొటీన్ ఆహారం తీసుకుంటున్నామనేది కాకుండా ఏ సమయంలో తీసుకుంటున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే సుమారు 25 నుంచి 30 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే రోజంతా శక్తిగా.. యాక్టివ్‌గా ఉండొచ్చు. ఇది ఆకలి నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఉదయం సరిపడా ప్రొటీన్ తీసుకుంటే మధ్యలో జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది.

మధ్యాహ్నం, రాత్రి భోజనంలో కూడా ప్రొటీన్ సోర్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక్కో భోజనంలో చిన్న పరిమాణంలో అయినా ప్రొటీన్ తీసుకుంటే అది శరీరానికి మెరుగైన శోషణ కలిగిస్తుంది. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం కంటే రోజంతా విభజించి తీసుకోవడం ఉత్తమం.

స్నాక్స్‌లో కూడా ప్రొటీన్ చేర్చుకోవడం మంచి అలవాటు. బాదం, పల్లీలు, గ్రీక్ యోగర్ట్, బాయిల్డ్ ఎగ్స్ వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకుంటే రోజువారీ ప్రొటీన్ టార్గెట్‌ను సులభంగా చేరుకోవచ్చు. ఇవి తక్కువగా తిన్నా ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి. ప్రతి రోజుకు 70 నుంచి 80 గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి బేసిక్ అవసరం. సరైన ఆహార పదార్థాలను ఎంచుకుని, రోజంతా సమతులంగా తీసుకుంటే శరీరం ఫిట్‌గా, ఎనర్జీతో నిండుగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper