Marriage things: పెళ్లి చేసుకునే అమ్మాయిలు తమని బాగా అర్థం చేసుకునే భాగస్వామి రావాలని కోరుకుంటారు. వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే ముందు నుంచే అనుకుంటారు. తమని అన్ని విధాలుగా అర్థం చేసుకునే అబ్బాయి లైఫ్ పార్ట్‌నర్‌గా రావాలని కోరుకుంటారు. తాము అనుకున్న లక్షణాలు ఉన్న అబ్బాయి లైఫ్‌లోకి వస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. ఇలా నచ్చిన లక్షణాలు అనే కాకుండా వాళ్లకి నచ్చని లక్షణాలను కూడా పెట్టుకుంటారు. కొందరు కొన్ని లక్షణాలు ఉన్న అబ్బాయిలు అయితే అసలు లైఫ్‌లోకి రాకూడదని భావిస్తారు. అయితే ఎవరి వ్యక్తిత్వం ఏంటని ముందే తెలియదు. కానీ కొన్ని లక్షణాలు ఉన్న అబ్బాయిలను అసలు అమ్మాయిలు ఇష్టపెట్టుకోరు. సెట్ కాని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు కూడా జీవితాంతం బాధపడతారు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండటం మేలని భావిస్తారు. అయితే అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు అంటే నచ్చరో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.
సమయం ఇవ్వని అబ్బాయిలు
అమ్మాయిలకు వారికి సమయం ఇచ్చే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా కూడా భాగస్వామికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. అసలు పూర్తిగా సమయం ఇవ్వని అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపెట్టుకోరు. భార్యలకి కనీసం సమయం ఇవ్వకపోతే ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా భార్యలకు కాస్త సమయం ఇవ్వండి.
భార్యలను పట్టించుకోని భర్తలు
కొందరు భర్తలు అసలు భార్యాలను పట్టించుకోరు. కనీసం వాళ్లతో కొంత సమయం మాట్లాడకుండా ఉంటారు. కనీసం రోజులో ఒక పది నిమిషాలు అయిన భార్యతో కలిసి కూర్చోని మాట్లాడరు. దీనివల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. కనీసం విలువ ఇవ్వకుండా పట్టించుకోని వారిని అసలు అమ్మాయిలు ఇష్టపెట్టుకోరు. భార్యాభర్తల మధ్య గౌరవం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే గుణం ఉండాలని నిపుణులు అంటున్నారు.
బాధ్యతగా ఉండే భర్తలను..
ఏ అబ్బాయిలు అయితే కుటుంబం అంటే బాధ్యతగా ఉంటారో అలాంటి వారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు తెలిసిన వారు భార్యను కూడా సరిగ్గా చూసుకుంటారని అమ్మాయిలు భావిస్తారు. అందుకే కుటుంబ బాధ్యతలు? భార్యను ఎలా చూసుకోవాలి? తెలిసి ఉంటుందట.
అన్ని విషయాలు దాచి పెట్టిన అబ్బాయిలను..
కొందరు భర్తలు అన్ని విషయాలను భార్యల దగ్గర దాచుతుంటారు. పర్సనల్, ఆఫీస్, ఫ్రెండ్స్ వంటి విషయాలను భార్యల దగ్గర దాచేస్తారు. వీటివల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.