Covid 19: కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులకు షాకింగ్ న్యూస్?

Covid 19: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా బారిన పడే ఛాన్స్ ఉండదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్ సోకితే ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తుండటం గమనార్హం. భారత వైద్య పరిశోధన మండలి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువగా గర్భిణీ […]

Written By: Navya, Updated On : September 18, 2021 10:22 am
Follow us on

Covid 19: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా బారిన పడే ఛాన్స్ ఉండదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. గర్భిణులకు కరోనా వైరస్ సోకితే ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తుండటం గమనార్హం. భారత వైద్య పరిశోధన మండలి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువగా గర్భిణీ స్త్రీలు కరోనా బారిన పడుతున్నారు. ఐసీఎంఆర్ పలు ఆస్పత్రుల ఇన్స్ట్రిట్యూట్ల సహకారంతో ఈ విషయాలను వెల్లడించింది. ఐసీఎంఆర్ 2020 సంవత్సరం మార్చి నెల నుంచి 2021 సంవత్సరం జనవరి నెల వరకు ఈ పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడించడం గమనార్హం. ఐసీఎంఆర్ విశ్లేషించిన డేటాలో 77 గర్భస్రావాలు నమోదైనట్టు తేలింది.

నెలలు నిండక ముందే ఏకంగా 528 మందికి ప్రసవం అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ మహిళల్లో 328 మంది గర్భిణులు రక్తపోటు సమస్యతో బాధ పడ్డారని సమాచారం. పిండ విచ్ఛిత్తి, మృతశిశువుల జననం శాతం ఏకంగా 6 శాతం వరకు ఉందని తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను సైతం అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా వైరస్ కేసులు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.