
Samantha Ruth Prabhu: సాధారణంగా ఎవరైనా కాలం కలిసిరాకపోతే.. అదృష్టం బాగాలేకపోతే.. కష్టాలు చుట్టుముడితే.. జీవితంలో ఒడిదొడుకులు ఎదురైతేనే ఆ దోషాలు పోవడానికి ఆలయాల సందర్శన చేస్తారు. ముఖ్యంగా ప్రముఖ శైవ క్షేత్రం ‘శ్రీకాళహస్తి’లో దోష నివారణ పూజలు చాలా ఫేమస్. ఇక్కడ పెళ్లి కాని వారికి.. పెళ్లై సంసారంలో చిక్కులున్న వారికి ప్రత్యేక దోష నివారణ పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ఆ శివుడికి చేస్తారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా శ్రీకాళహస్తికి ఒంటరిగా వచ్చి ఈ పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత తిరుమల శ్రీవారిని ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు.

ఇంతటి ముఖ్యమైన కార్యక్రమాలకు సాధారణంగా భర్తలతో వస్తారు. కానీ సమంత ఒంటరిగా వచ్చింది. కొద్దికాలంగా నాగచైతన్యతో విభేదాలు వచ్చాయని.. ఇద్దరూ విడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడాకులకు కూడా అప్లై చేశారని టాక్ నడిచింది. ఇక సమంత తన ఇంటిపేరు ‘అక్కినేని’ తీసేసి ‘సమంత రుతుప్రభు’గా మార్చేసింది. ఎందుకని ప్రశ్నించిన మీడియాతో ‘సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని ట్విస్ట్ ఇచ్చింది.
ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయాల్లో దోష నివారణ పూజలు చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో సమంత వ్యక్తిగత జీవితం నిజంగానే ప్రమాదంలో పడిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి దీనిపై సమంత అయితే ఇప్పటివరకు నోరు మెదపలేదు. కేవలం క్యాజువల్ దేవాలయాల సందర్శనగానే చెబుతోంది. దీంతో సమంత-నాగచైతన్య వివాహ బంధం ఏమవుతుందనేది వేచిచూడాలి.