Prison: అశ్లీల వీడియోలు.. ఇక చూస్తే మీ పని ఖతమే

Prison: నీలిచిత్రాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో అందరికి చేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. కానీ కొందరు మాత్రం నీలిచిత్రాల వీక్షణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. నీలి చిత్రాలు చూస్తూ ప్రేరేపితమై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అయినా వాటిని నిరోధించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వయసుతో సంబంధం లేకుండానే వాటి వినియోగంతో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నీలిచిత్రాల […]

Written By: Srinivas, Updated On : September 18, 2021 11:22 am
Follow us on

Prison: నీలిచిత్రాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో అందరికి చేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. కానీ కొందరు మాత్రం నీలిచిత్రాల వీక్షణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. నీలి చిత్రాలు చూస్తూ ప్రేరేపితమై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అయినా వాటిని నిరోధించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వయసుతో సంబంధం లేకుండానే వాటి వినియోగంతో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నీలిచిత్రాల వీక్షణంతో ఇబ్బందులే సృష్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు కూడా నీలిచిత్రాలు ఎక్కువగానే చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలతో అసహజంగా చిత్రీకరించిన నీలిచిత్రాలు చూస్తున్న వారు నేరుగా జైలుకే పంపిస్తున్నారు. వారు ఎక్కడున్నా పట్టుకుని కోర్టుల్లో హాజరుపరుస్తున్నారు. గత నాలుగైదేళ్లుగా పిల్లలతో చిత్రీకరించిన నీలిచిత్రాల వెబ్ సైట్లను వీక్షించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర హోం శాఖ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది.

దేశవ్యాప్తంగా నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించి వారి ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లను గుర్తించి వారి చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తించి వాటిని ఆయా స్టేట్లకు పంపుతోంది. ఇప్పటివరకు 1095 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా నీలిచిత్రాల వెబ్ సైట్లను చూస్తున్న వారిని జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తించేందుకు సంకల్పించింది.

నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించేందుకు సీ సామ్ అనే అమెరికన్ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఓ ఒప్పందం చేసుకుంది. దీంతో మహారాష్ర్ట, కేరళ స్టేట్లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నీలిచిత్రాలు చూస్తున్న వారిని గుర్తించి జైలుకు పంపుతున్నారు. కేరళలో పీ హంట్ పేరుతో నీలిచిత్రాలు చూస్తున్నవారి గురించి వివరాలు సేకరిస్తున్నారు.

చిన్నారులపై చిత్రీకరించే నీలిచిత్రాల వీక్షణాన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దొరికితే శిక్షలు కూడా కఠినంగానే వేస్తున్నాయి. మొదటి సారి దొరికితే ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నాయి. రెండోసారి దొరికితే ఏడేళ్ల పాటు జైలు, రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో 16 కేసులు నమోదు కాగా ఇందులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు గతేడాది ఇరవై కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురిపై రెండోసారి కేసులు నమోదయ్యాయి.