యూకేలో కొత్తరకం కరోనా శరవేగంగా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు అక్కడ కొత్తరకం కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు సాధారణ కరోనాతో పోలిస్తే కొత్తరకం కరోనా మరింత ప్రమాదమని వెల్లడిస్తున్నారు. సాధారణ కరోనా పిల్లలతో పోలిస్తే పెద్దలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే కొత్తరకం కరోనా మాత్రం పెద్దలతో పోలిస్తే పిల్లలపైనే తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?
15 సంవత్సరాల లోపు విద్యార్థులు కొత్తరకం కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు సైతం తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. పిల్లలపై వైరస్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే చిన్నారులతో పాటు పెద్దలు కూడా కొత్తరకం కరోనా బారిన పడతారని కానీ వారు తక్కువగా పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: కరోనా కొత్తరకం వైరస్ కు వ్యాక్సిన్ పని చేస్తుందా..?
పిల్లల కణాల్లోకి కొత్తరకం వైరస్ సులభంగా ప్రవేశించగలదని.. మట్టిలో ఆడుకునే పిల్లలు త్వరగా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ 50 శాతానికి పైగా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ కరోనా వైరస్ తో పోలిస్తే ఈ వైరస్ ప్రాణాంతకం కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధారాలు ఉండటంతోనే ఈ విషయాలను వెల్లడిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
కొత్తరకం కరోనా మహమ్మారికి సంబంధించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూకేలో వైరస్ వ్యాప్తి వల్ల విమాన సర్వీసులు ఆగిపోయాయి. అయితే కొత్తరకం కరోనా మహమ్మారికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.