https://oktelugu.com/

2020లో వివాహ బంధంతో ఏకమైన సినీ ప్రముఖులు !

ప్రతి మనిషి జీవితంలో చావు పుట్టుకకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలానే పెళ్ళికి కూడా ఉంటుంది. చావు పుట్టుకలనేవి మన చేతుల్లో లేనివి కాబట్టి కనీసం పెళ్లి అయినా నచ్చిన విధంగా నచ్చిన వారిని చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశ పడతారు.కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించటం వల్ల పెళ్లి చేసుకోవాటానికి నానా ఇబ్బందులు పడ్డారు. కొందరైతే ఏకంగా పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సాధారణంగా పెళ్లి అంటే జరుగుతున్న ఇంట్లోనో, ఆ గ్రామంలోనో సందడి ఉంటుంది . […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 08:15 PM IST
    Follow us on


    ప్రతి మనిషి జీవితంలో చావు పుట్టుకకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలానే పెళ్ళికి కూడా ఉంటుంది. చావు పుట్టుకలనేవి మన చేతుల్లో లేనివి కాబట్టి కనీసం పెళ్లి అయినా నచ్చిన విధంగా నచ్చిన వారిని చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశ పడతారు.కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించటం వల్ల పెళ్లి చేసుకోవాటానికి నానా ఇబ్బందులు పడ్డారు. కొందరైతే ఏకంగా పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సాధారణంగా పెళ్లి అంటే జరుగుతున్న ఇంట్లోనో, ఆ గ్రామంలోనో సందడి ఉంటుంది . కానీ ప్రముఖుల పెళ్లి జరిగితే హడావిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల పెళ్లి అయితే చెప్పేదేముంది రాష్ట్రం మొత్తం హంగామా కనిపిస్తుంది.విఐపిలు , తోటి నటి నటులు, అభిమాన సంఘాల నాయకులు, అభిమానులతో సంబరంలా జరుగుతుంది . కానీ ఈ సంవత్సరం కరోనా నియమాల కారణంగా సినీ పరిశ్రమకు చెందిన కొందరు చడీ చప్పుడు లేకుండా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రపంచంలో ఎంతో మందికి ‘2020’ చేదు జ్ఞాపకాలు మిగిలిస్తే వీరికి మాత్రం మధురానుభూతుల్ని పంచింది.

    Also Read: అభిజీత్ కామెంట్స్ పై ‘హారిక’ రియాక్షన్ ఏమిటో ?

    1. నిఖిల్-పల్లవి వర్మ :

    మొదటిగా మాట్లాడుకోవాల్సింది హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి,లాక్‌డౌన్ సమయంలో కరోనా నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ఈ యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు. 2020 మే 14న పెద్దలు నిశ్చయించిన ముహూర్తం ప్రకారం…తన ప్రియురాలు పల్లవి వర్మ మెడలో తాళి కట్టాడు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈయనతోనే టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి మొదలయింది.

    2. నితిన్-షాలిని

    నిఖిల్ వివాహం అయిన తర్వాత మరో టాలీవుడ్ హీరో నితిన్ కూడా పెళ్లి పీటలెక్కేశాడు. అతడు కూడా ప్రేమించిన అమ్మాయి షాలిని కందుకూరిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 2020 జూలై 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ మంత్రులు యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు హాజరయ్యారు.

    3. రానా-మిహీక బజాజ్

    ఎన్నో రోజులుగా టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న దగ్గుబాటి రానా కూడా లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకున్నాడు. 2020 ఆగస్టు 8న జరిగిన ఈ వేడుకలో తన ప్రియురాలు మిహీక బజాజ్‌ను పెద్దల సమక్షంలో పెళ్లాడాడు. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు 30 మంది మాత్రమే అతిథులు హాజరయ్యారు.

    Also Read: ‘సాయి తేజ్’తో బాగా కుదిరిందంటున్న నభా నటేష్ !

    4. కాజల్-గౌతమ్ కిచ్లు

    కాజల్ తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి పుష్కర కాలం దాటిపోయింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ స్టేటస్ పొంది చాలా కాలం టాప్ ప్లేస్ లో కొనసాగింది. దాదాపు తెలుగు బడా హీరోలందరి సరసన ఆడి పాడింది . చాలా కాలంగా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించిన ఆమె.. 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొంత మంది ప్రముఖులు హాజరయ్యారు.

    5. నిహారిక- చైతన్య

    మెగా డాటర్ నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిహారిక మ్యారేజ్ గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో డిసెంబర్ 9 బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో జరిగింది. దీనికోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలొచ్చింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా మెగా కుటుంబం అంతా వచ్చి నిహారిక పెళ్లిలో డాన్సులు చేసారు కూడా. పవన్ నుంచి పంజా వైష్ణవ్ తేజ్ వరకు అంతా అక్కడే ఉన్నారు. ఈ ఇయర్ లో అత్యంత గ్రాండ్ గా నిహారిక చైతన్య మ్యారేజ్ జరిగింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్