https://oktelugu.com/

అభిజీత్ కామెంట్స్ పై ‘హారిక’ రియాక్షన్ ఏమిటో ?

తెలుగు రాష్ట్రాల ప్రజల అందరిని 105 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ షో గత ఆదివారం దిగ్విజయంగా పూర్తి అయింది. బుల్లితెర షోలలో టాప్ రేటింగ్స్ తో నెం.1 ప్లేస్ లో నిలబడింది. మొదట ఆశించినంత హైప్ రాకపోయినప్పటికీ రోజు షోలో జరుగుతున్న వివిధ రకాల టాస్క్ లు ప్రేక్షకులని ఆకర్షించాయి. అన్నిటికన్నా ఇలాంటి షోలలో ఎమోషన్స్ అనేవి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వటానికి, విపరీతమైన హైప్ రావటానికి ముఖ్య కారణాలు […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 08:08 PM IST
    Follow us on


    తెలుగు రాష్ట్రాల ప్రజల అందరిని 105 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ షో గత ఆదివారం దిగ్విజయంగా పూర్తి అయింది. బుల్లితెర షోలలో టాప్ రేటింగ్స్ తో నెం.1 ప్లేస్ లో నిలబడింది. మొదట ఆశించినంత హైప్ రాకపోయినప్పటికీ రోజు షోలో జరుగుతున్న వివిధ రకాల టాస్క్ లు ప్రేక్షకులని ఆకర్షించాయి. అన్నిటికన్నా ఇలాంటి షోలలో ఎమోషన్స్ అనేవి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వటానికి, విపరీతమైన హైప్ రావటానికి ముఖ్య కారణాలు అవుతాయి. షో నిర్వాహకులు కూడా మెయిన్ గా ఈ విషయం మీదనే షోని ప్లాన్ చేసి రసవత్తరంగా ముగించారు.

    Also Read: అభిజీత్ పేల్చిన బాంబుతో హర్ట్ అయిన హారిక ఫ్యాన్స్ ?

    ప్రతి సీజన్ లోనూ అమ్మాయి అబ్బాయి సన్నిహితంగా ఉంటూ వారి మధ్యన ఏదో ఉన్నట్టు అనిపించేలా మూవ్ అవుతారు. షో నుండి బయటకి వచ్చాక మా మధ్యన ఏం లేదని జనాలని వెర్రి వెంగళప్పలని చేస్తారు. బిగ్ బాస్ 4 సక్సెస్ అవ్వటానికి అఖిల్-మోనాల్, అభిజీత్-హారిక, అవినాష్-అరియానా జంటల మధ్యన నడిచిన కెమిస్ట్రీనే కారణంగా చెప్పుకోవాలి.అభిజీత్,హరికలని వాళ్ళ అభిమానులు ముద్దుగా ‘అభిక ‘ అని పిలుచునేంత సన్నిహితంగా కెమిస్ట్రీ నడిచింది. ఇది కూడా అభిజీత్ విన్నర్ అవటానికి ఒక అంశం అయ్యింది . బయటకి వచ్చాక అభి హరికలు ఎలా ఉంటారో, ఏం చేస్తారో అని అభిమానులు ఎన్నో ఊహాగానాలతో ఉన్నారు. వారందరిని బయటకి వచ్చిన రెండో రోజునే షాక్ కి గురి చేశారు అభిజీత్ .

    Also Read: పవన్ ఫ్యాన్స్ కి థమన్ పూనకాలు తెప్పిస్తాడట

    ఈ సీజన్ మొదటి వారంలో మోనాల్ తో కొంచెం క్లోజ్ గా ఉన్నా, మోనాల్ తో వచ్చిన విభేదాలతో దూరమయ్యాడు. ఆ సమయంలో హరిక అభిజీత్ కి దగ్గరయింది . వీరిద్దరూ తమ రిలేషన్ ను చివరి వరకు కొనసాగించారు.ఈ నేపథ్యంలో ఈరోజు అభిజిత్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మా ఇంట్లో నాకు తమ్ముడు ఉన్నాడు కానీ చెల్లి లేదు, ఈ షోలో నాకు హారిక ఆ లోటు తీర్చింది, ఆ సంగతి నేను హరికకి కూడా చాలా సార్లు చెప్పాను అని అందరి మైండ్స్ బ్లాంక్ అయ్యేలా చేసాడు.ఆ మాటలు విన్న ‘అభిక’ ఫ్యాన్స్ గుండెలు పగిలిపోయాయట. మరి ‘అభిక’కు ఎలా ఉందో చూడాలి. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్