https://oktelugu.com/

గంగవ్వను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్లు.. గేమ్ రసవత్తరంగా మారనుందా?

  బిగ్ బాస్-4 సీజన్ మొదట్లో చప్పగా సాగింది. అయితే తొందరగానే ‘బిగ్ బాస్’ దీనిని గుర్తించి మంచిమంచి టాస్కులతో అలరిస్తున్నాడు. రొమాంటిక్.. మసాలా.. కాంట్రవర్సీలతో ప్రస్తుత బిగ్ బాస్-4 దూసుకెళుతోంది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టుల మధ్య గొడవలు రసవత్తవరంగా మారుతుండటంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. Also Read: ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను కోల్పోతుందా? ఐదువారాలుగా బిగ్ బాస్-4 కొనసాగుతోంది. 105రోజుపాటు సాగే బిగ్ బాస్ షో ఇప్పటికే నెలరోజులను పూర్తి చేసుకుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 03:11 PM IST
    Follow us on

     

    బిగ్ బాస్-4 సీజన్ మొదట్లో చప్పగా సాగింది. అయితే తొందరగానే ‘బిగ్ బాస్’ దీనిని గుర్తించి మంచిమంచి టాస్కులతో అలరిస్తున్నాడు. రొమాంటిక్.. మసాలా.. కాంట్రవర్సీలతో ప్రస్తుత బిగ్ బాస్-4 దూసుకెళుతోంది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టుల మధ్య గొడవలు రసవత్తవరంగా మారుతుండటంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను కోల్పోతుందా?

    ఐదువారాలుగా బిగ్ బాస్-4 కొనసాగుతోంది. 105రోజుపాటు సాగే బిగ్ బాస్ షో ఇప్పటికే నెలరోజులను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ కొందరు ఎలిమినేట్ కాగా.. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఐదువారాల నుంచి బిగ్ బాసులో కొనసాగుతున్న కంటెస్టులు మరిన్ని రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఎంటట్మైనెంట్ అందిస్తారో వారే హౌస్ లో ఉంటారని.. ప్రేక్షకులు వారికే ఓట్లు వేస్తారని హోస్టు నాగార్జున కూడా కంటెస్టులకు వార్నింగ్ ఇచ్చారు.

    ఈనేపథ్యంలో కంటెస్టుల మధ్య పోటీ మొదలైంది. ఎవరికీ వారు తమను తాము సేఫ్ చేసుకుంటూ ఇతరులు ఎలిమినేట్ అయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో పెద్దవ్వగా కొనసాగుతున్న గంగవ్వను కొందరు టార్గెట్ చేస్తున్నారు. గంగవ్వకు బిగ్ బాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న కంటెస్టులు కూడా ఆమెతో గొడవకు దిగేందుకు సహసించడం లేదు.

    అయితే ఇలా ఎన్నిరోజులు ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో పోటీలో తాము ఉండాలంటే ప్రేక్షకుల దృష్టిలో పడాల్సేందే. దీంతో ఇన్నిరోజులు గంగవ్వకు జై కొట్టిన కంటెస్టులు మెల్లిమెల్లిగా ఆమెను టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. తాజాగా జరిగిన బీబీ హోటల్ టాస్కులో విజేతగా గెస్ట్ టీమును బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ సందర్భంగా గెస్ట్ టీంలో ఒక బెస్ట్ ప్లేయర్ ను సెలక్ట్ చేయమని గంగవ్వను బిగ్ బాస్ కోరాడు.

    దీనిపై సొహైల్ తీవ్ర అహసనం వ్యక్తం చేశాడు. ‘గంగవ్వే ప్రతిదీ చెప్పాలని రూల్ లేదు.. ఆమె నిర్ణయాన్ని జడ్జిమెంట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతీసారి ఇలాగే అవుతుంది’ అంటూ ‘బిగ్ బాస్’ను ఉద్దేశించి సొహైల్‌ అన్నాడు. అయితే బిగ్ బాస్ కోరిక మేరకు గంగవ్వ మెహబూబ్‌కి ఓటేసింది. అరియానా సైతం మెహబూబ్‌ పేరు  చెప్పింది. దీంతో సొహైల్‌, మెహబూబ్‌ని తనకు సపోర్ట్ చేయమని కోరాడు. అయితే అరియానా కూడా తనను సపోర్ట్ చేయాలని కోరింది.

    Also Read: అమ్మాయిలూ జాగ్రత్త అన్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

    సుదీర్ఘ చర్చల తర్వాత సొసైల్ ను బెస్ట్ ప్లేయర్ గా ఫైనల్ చేశారు. దీంతో సొహైల్ కెప్టెన్సీ రేసులో నిలిచాడు. అయితే కొద్దిరోజులుగా ఒక్కొక్కరు గంగవ్వపై ఉన్న కోపాన్ని మెల్లిమెల్లిగా వెలికితీస్తున్నట్లుగా కన్పిస్తోంది. అయితే అందరికీ కంటే గంగవ్వకే ప్రతీసారి ఓటింగులో ఎక్కువ వస్తున్నాయి. దీంతో ఆమెకు కంటెస్టెంట్లు ఏవిధంగా చెక్ పెడుతారనేది ఆసక్తికరంగా మారింది.