https://oktelugu.com/

ఈ మాస్క్ ధరిస్తే గంటలో కరోనా వైరస్ ఖతం..!

దేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాల్లో 1000 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు, ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు కరోనాకు చెక్ పెట్టే ప్రత్యామ్నాయాల దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించి మరో శుభవార్త చెప్పారు. తాము […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 13, 2020 9:56 am
    Follow us on


    దేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాల్లో 1000 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు, ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు కరోనాకు చెక్ పెట్టే ప్రత్యామ్నాయాల దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి.

    తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించి మరో శుభవార్త చెప్పారు. తాము తయారు చేసిన కాటన్ మాస్క్ సహాయంతో కరోనా వైరస్ ను సులువుగా కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కాటన్ మాస్క్ ను ధరించి సూర్యకాంతిలో గంట సమయం ఉంటే గంటలోనే 99.99 శాతం వైరస్ కట్టడి అవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తలు ఈ మాస్క్ ను మళ్లీమళ్లీ ఉపయోగించేలా తయారు చేయడం గమనార్హం.

    ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్‌ఫేసెస్‌లో పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. గంటలోనే వైరస్ కు కట్టడి చేసే మాస్క్ కావడంతో ఈ మాస్క్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మాస్క్ ను పదిసార్లు వాష్ చేసి మళ్లీ ఉపయోగించవచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కనీసం 7 రోజుల పాటు ఈ మాస్క్ కు సూర్యరశ్మి తగిలేలా చూడాలని చెప్పారు.

    ఈ మాస్క్ కు సూర్యరశ్మి తగిలితే మాస్క్ యాంటీమైక్రోబయాల్ చర్యను కోలోదని.. మాస్క్ పై సూర్యకిరణాలు పడిన వెంటనే రీయాక్టివ్ ఆక్సిజన్ స్పైసెస్ విడుదలై మాస్క్ పై ఉన్న మైక్రోబ్స్ చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.