https://oktelugu.com/

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ విద్యాశాఖ..?

కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఓపెన్ అవుతున్న పాఠశాలలు ఈ సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలల పనిదినాలను విద్యార్థులు నష్టపోయారు. తెలంగాణ విద్యాశాఖ డిసెంబర్ నెల నుంచి పాఠశాలల రీఓపెన్ దిశగా అడుగులు వేస్తోంది. ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంతో పోలిస్తే పదో తరగతి పరీక్షల్లో భారీగా ఛాయిస్ లను పెంచడానికి సిద్ధమైంది. ఛాయిస్ లను పెంచడం […]

Written By: Kusuma Aggunna, Updated On : November 13, 2020 10:00 am
Follow us on


కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఓపెన్ అవుతున్న పాఠశాలలు ఈ సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలల పనిదినాలను విద్యార్థులు నష్టపోయారు. తెలంగాణ విద్యాశాఖ డిసెంబర్ నెల నుంచి పాఠశాలల రీఓపెన్ దిశగా అడుగులు వేస్తోంది. ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

గతంతో పోలిస్తే పదో తరగతి పరీక్షల్లో భారీగా ఛాయిస్ లను పెంచడానికి సిద్ధమైంది. ఛాయిస్ లను పెంచడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పడదని విద్యాశాఖ భావిస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఒక్కో పేపర్ కు 40 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది గతేడాదితో పోలిస్తే పార్ట్-బీలో అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల పెంపు ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

అయితే పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులు చేసిన ఇంటర్ ప్రశ్నాపత్రాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని.. జాతీయ పోటీ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది. ఏప్రిల్ నెల చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారని సమాచారం. తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంటర్ విద్యార్థులకు మాత్రం వాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రశ్నాపత్రాల విషయంలో మార్పులు చేయకుండా కీలక నిర్ణయం తీసుకుంది.