https://oktelugu.com/

సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్న కరోనా వ్యాక్సిన్.. వారికి ప్రమాదమే…?

ప్రపంచ దేశాల ప్రజలను 12 నెలల పాటు గజగజా వణికించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. బ్రిటన్ లో ప్రముఖ డ్రగ్ కంపెనీకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మరికొన్ని నెలల్లో వైరస్ అంతమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే సంతోషం ఉన్నా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2020 / 12:39 PM IST
    Follow us on


    ప్రపంచ దేశాల ప్రజలను 12 నెలల పాటు గజగజా వణికించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. బ్రిటన్ లో ప్రముఖ డ్రగ్ కంపెనీకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మరికొన్ని నెలల్లో వైరస్ అంతమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే సంతోషం ఉన్నా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

    తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కరోనా వ్యాక్సిన్ సంతానోపత్తిపై ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాక్సిన్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయని ప్రచారం జరగడంతో వైరల్ అవుతున్న వార్తలు ప్రజలను కంగారు పెడుతున్నాయి. వ్యాక్సిన్ భవిష్యత్తులో మహిళలు గర్భం దాల్చడంపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

    యూకేకు చెందిన గైనకాలజిస్ట్ జేమ్స్ నికోపులన్స్ గర్బంతో ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కడుపులోని బిడ్డపై కూడా వ్యాక్సిన్ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా వ్యాక్సిన్లకు దగ్గరగా ఉంటే మంచిదని సూచనలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు తల్లి లేదా బిడ్డ ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    కరోనా వ్యాక్సిన్ కొత్త రకమైన వ్యాక్సిన్ కాగా శరీరంలో ఇమ్యూనిట్ పవర్ పెరిగే అవకాశం ఉందని.. వ్యాక్సిన్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా స్పందిస్తుందని.. అయితే సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.