https://oktelugu.com/

అన్నదాతకు సాయమేదీ? ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోరా?

కరోనా.. లాక్డౌన్ ను సైతం లెక్క చేయకుండా రైతన్న వ్యవసాయం చేశాడు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే వారి శ్రమను గుర్తించకపోవడం శోచనీయంగా మారింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలు చేయాలని పంజాబ్.. హర్యానా రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: కేసీఆర్ ఫ్యామిలీలో కొత్త మార్పు.. గమనించారా? మరోవైపు ఏపీలో నివర్ తుఫాన్ ధాటికి భారీగా పంట నష్టం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 12:59 PM IST
    Follow us on

    కరోనా.. లాక్డౌన్ ను సైతం లెక్క చేయకుండా రైతన్న వ్యవసాయం చేశాడు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే వారి శ్రమను గుర్తించకపోవడం శోచనీయంగా మారింది.

    కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలు చేయాలని పంజాబ్.. హర్యానా రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

    Also Read: కేసీఆర్ ఫ్యామిలీలో కొత్త మార్పు.. గమనించారా?

    మరోవైపు ఏపీలో నివర్ తుఫాన్ ధాటికి భారీగా పంట నష్టం వాటిల్లింది. మరికొద్దిరోజుల్లో పంట చేతికి వస్తుందని భావించిన రైతులకు నివర్ తుఫాన్ నిరాశే మిగిల్చింది.

    పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ సర్కార్ ప్రకటించింది. అయితే నేటికి బాధితులకు ఎలాంటి పరిహారం అందకపోవడంతో రైతులు ఆత్మహ్యలకు సిద్ధపడుతున్నారు.

    గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంనకు చెందిన కౌలు రైతు హరిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని బాపట్ల జమ్ములపాలెంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది.

    Also Read: అమరావతి ఉద్యమం.. రైతుల చూపు ఆయనవైపే

    నివర్ తుఫానుతో దెబ్బకు హరిబాబు రూ.6 లక్షలు నష్టం జరిగినందని సమాచారం. ఈ అప్పులభారం తీర్చే దారిలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని గ్రామస్థులు చెబుతున్నారు.

    పంట నష్టపోయి తీవ్రంగా నిరాశలో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

    రైతులకు పరిహారం వెంటనే అందిస్తే కొంతమేర అన్నదాతకు భరోసా కలుగుతుందని వారు సూచించారు. ఇకనైనా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయమందించేందుకు ముందుకు రావాలని అన్నివర్గాల ప్రజలు కోరుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్