https://oktelugu.com/

కేసీఆర్ ఫ్యామిలీలో కొత్త మార్పు.. గమనించారా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి సత్తాచాటింది. అయితే సీఎం కేసీఆర్ క్యాబినెట్లోనూ.. కీలకమైన పదవుల విషయంలోనూ ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. Also Read: ఢిల్లీ పర్యనలో కేంద్రాన్ని కేసీఆర్ ఏం కోరాడంటే..? ఈ విమర్శలను సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈక్రమంలోనే గత పార్లమెంట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 3:58 pm
    Follow us on

    KCR family

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి సత్తాచాటింది. అయితే సీఎం కేసీఆర్ క్యాబినెట్లోనూ.. కీలకమైన పదవుల విషయంలోనూ ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి.

    Also Read: ఢిల్లీ పర్యనలో కేంద్రాన్ని కేసీఆర్ ఏం కోరాడంటే..?

    ఈ విమర్శలను సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈక్రమంలోనే గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కూతురు కవిత ఘోర పరాజయం పాలైంది. కాగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు.

    త్వరలోనే క్యాబినెట్లో మార్పులు చేర్పులకు కేసీఆర్ సిద్ధమవుతుండటంతో కవితకు మంత్రి పదవీ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. కేటీఆర్.. కవితలలో చాలా మార్పు వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చర్చించుకోవడం కన్పిస్తోంది.

    దుబ్బాక.. గ్రేటర్ ఫలితాలకు ముందు కార్యకర్తలకు ఈ నలుగురి అపాయిమ్మెంట్ దొరకడమే గగనంగా మారిందనే టాక్ ఉంది. మంత్రులకు సైతం వీరి అపాయింట్మెంట్ దొరకని సందర్భాలు అనేక ఉన్నాయని టీఆర్ఎస్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. తెలంగాణ ఏ పని కావాలన్న సంబంధిత మంత్రి కంటే వీరు చెబితే పని సులభంగా అయ్యేదని రాజకీయాల్లో వర్గాల్లో టాక్ నడిచింది.

    అయితే దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో సీఎం కేసీఆర్ తన ఫ్యామిలీని మెంబర్లను అలర్ట్ చేసినట్లుగా కన్పిస్తోంది. ప్రగతిభవన్ టూ ఫాంహౌస్.. ఫాంహౌస్ టూ ప్రగతిభవన్.. ఇకపోతే ఢిల్లీకి మాత్రమే కేసీఆర్ తిరుగుతాడని ప్రతిపక్షాలు కిందటి ఎన్నికల్లో ప్రచారం చేసి విజయం సాధించారు.

    Also Read: వ్యాక్సిన్ పంపిణీకి ‘తెలంగాణ’ ఏర్పాట్లు: స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సరఫరా..

    ఈక్రమంలోనే సీఎం కేసీఆర్.. కేటీఆర్.. కవితలు కొద్దిరోజులుగా జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. కేటీఆర్ ఖమ్మం జిల్లాలో ఐటీ ప్రారంభించడం.. ఆ వెంటనే సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటనలు.. టీఆర్ఎస్ నేతల కొడుకులు.. కూతుర్ల వివాహాలకు హాజరవ్వడం కన్పించింది.

    సీఎం కేసీఆర్ సైతం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూతురు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లికి రాష్ట్రానికి సంబంధించిన నిధులపై కేంద్రమంత్రులు.. ప్రధాని మోదీతో చర్చించారు.

    ఎమ్మెల్సీ కవిత సైతం టీఆర్ఎస్ కార్యకర్తల వివాహాలకు వెళుతూ అందరితో కలిసిపోతుండటం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతోపాటు జమిలి ఎన్నికలు తెరపైకి వచ్చాయి.

    ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ వరుసగా ప్రజల్లో తిరుగుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మార్పు ఎన్నికల వరకే ఉంటుందా? లేదా దీనిని కంటిన్యూ చేస్తారా? అనేది వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్