కరోనాతో 30 రోజుల్లో మరణిస్తే పరిహారం.. ఈ పరిహారాన్ని ఎలా పొందాలంటే?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకిన వాళ్లలో లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు 30 రోజుల్లో చనిపోతే ఆ మరణాలను కరోనా మరణాలుగా గుర్తించాలని సూచనలు చేసింది. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా మరణాలకు సంబంధించి వైద్య ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని సూచనలు చేసింది. వైద్య ధృవీకరణ పత్రాలను పొందిన […]

Written By: Kusuma Aggunna, Updated On : October 28, 2021 10:20 am
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకిన వాళ్లలో లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు 30 రోజుల్లో చనిపోతే ఆ మరణాలను కరోనా మరణాలుగా గుర్తించాలని సూచనలు చేసింది. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా మరణాలకు సంబంధించి వైద్య ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని సూచనలు చేసింది.

వైద్య ధృవీకరణ పత్రాలను పొందిన వాళ్లు 14 రోజుల్లోగా 50,000 రూపాయల పరిహారాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బాధిత కుటుంబం నుంచి దరఖాస్తు అందిన 30 రోజులలో ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాలని సూచనలు చేసింది. ఏపీలో ఇప్పటివరకు అధికారికంగా 14,364 మంది కరోనా వల్ల మృతి చెందారు. కరోనా సోకి 30 రోజుల్లో మృతి చెందిన వాళ్లు పరిహారం పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

డాక్టర్ గీతా ప్రసాదిని గత నెల 8వ తేదీన సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన కేంద్ర మార్గదర్శకాలను జిల్లా అధికారులకు పంపడం జరిగింది. కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో పాటు ఆస్పత్రుల్లో చేరి మరణించినా ఆస్పత్రికి నుంచి ఇంటికి వచ్చాక మరణించినా అందుకు కరోనానే కారణమని గుర్తించాలి. కరోనా సోకిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నా, విషం తాగినా, ప్రమాదంలో మృతి చెందినా వాళ్లు పరిహారం పొందడానికి అనర్హులని చెప్పవచ్చు.

బాధిత కుటుంబాలకు చెందిన వాళ్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్, డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఇతర ఆధారాలను దరఖాస్తుతో పాటు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఆశా వర్కర్లతో పాటు ఏ.ఎన్.ఎం, మెడికల్ ఆఫీసర్ కు సంబంధించిన సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. కమిటీ నిర్ణయంతో సంతృప్తి చెందని వారు జిల్లాలలో కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీని మాత్రం ఆశ్రయించే అవకాశం అయితే ఉంటుంది.