https://oktelugu.com/

RRR Movie: అక్టోబర్ 29 సర్ ప్రైజ్ కి రెడీ గా ఉండండి అంటున్న ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్ టీమ్…

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న  పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో  కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ కనిపించనున్నారు. వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని… పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను […]

Written By: , Updated On : October 28, 2021 / 10:08 AM IST
Follow us on

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న  పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో  కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ కనిపించనున్నారు. వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

rrr movie team ready to surprise fans on october 29

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని… పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను భారీస్థాయిలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా  విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల బిగ్ డే.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అంటూ మరోసారి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మూవీ యూనిట్.

ఈ మేరకు ట్విటర్ లో అక్టోబర్ 29న ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడని, వినని ఒక కొలాబ్రేషన్‌ని చూడబోతున్నారు. ఇదొక సెన్సేషన్ అవుతుంది. ఆ రోజు ‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.  అయితే సంక్రాంతికి మరికొన్ని పెద్ద సినిమాలు విడుదల కాబోతుండడం… పండక్కి కేవలం వారం రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అంటూ సడెన్‌గా ప్రకటించడంతో సినిమా విడుదల వాయిదా పడుతుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో 29వ తేదీన ఏ అప్డేట్ ఇవ్వనున్నారా  అని ప్రేక్షకులంతా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు.   కాగా ఈ సినిమా ఫైనల్ కట్ రెడీ అయ్యిందని … మూవీ 2 గంటల 45 నిమిషాల నిడివి వచ్చిందని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.