https://oktelugu.com/

Packet  Milk : ప్యాకెట్ పాలను ఎక్కువ సమయం వేడి చేయడం ఎంత డేంజరో? తెలిస్తే ఆశ్చర్య పోతారు

ప్యాకెట్ పాలు వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ప్యాకెట్ పాలు వాడేటప్పుడు కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరి ఈ ప్యాకెట్ పాల విషయంలో చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Bhaskar
  • , Updated On : October 24, 2024 / 11:35 PM IST

    Packet  Milk

    Follow us on

    Packet  Milk : పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పూర్వం రోజుల్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉండేవి. వీటిని పెంచుకోవడం వల్ల నాణ్యమైన పాలు తాగడంతో పాటు పెరుగు, నెయ్యి కూడా చేసుకునేవారు. ముఖ్యంగా హిందువులు ఆవులను పూజిస్తారు. ఈ రెండు కారణాల వల్ల గోవులను పెంచుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసిన ఆవులు పెంచుకునే వారు కనిపించరు. ముఖ్యంగా పట్టణాల్లో అయితే కష్టమే. ఒకవేళ కనిపించిన వాటికి మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్నారు. పూర్వం రోజుల్లో స్వతహాగా ఆవులు గర్భం దాల్చితే.. ఈ రోజుల్లో ఇంజెక్షన్ల ద్వారా అవి గర్భం దాల్చుతున్నాయి. దీనివల్ల పాలలో కూడా కల్తీ ఏర్పడుతుంది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ప్యాకెట్ పాలనే ఎక్కువగా వాడుతున్నారు. కొందరు డబ్బుల కోసం ఈ పాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కల్తీ పాలు వార్తలు కూడా వింటూనే ఉంటున్నాం. అయితే స్వచ్ఛమైన పాలు దొరకకపోవడంతో కొందరు ప్యాకెట్ పాలు వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ప్యాకెట్ పాలు వాడేటప్పుడు కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరి ఈ ప్యాకెట్ పాల విషయంలో చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    పాలలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తాగుతారు. పాలను తాగడం వల్ల ఎముకలు బలంగా తయారై ఆరోగ్యంగా ఉంటారని తాగుతారు. అయితే ఎక్కువ మంది ప్యాకెట్ పాలను వినియోగిస్తున్నారు. ఈ ప్యాకెట్ పాల నుంచి మీగడ రావాలని లేదా పాలు బాగా మరగాలని కొందరు ఎక్కువ సమయం వీటిని వేడి చేస్తారు. ప్యాకెట్ పాలను ఎక్కువ సమయం ఇలా వేడి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా దొరికే ఆవు లేదా గేదె పాలను వేడి చేయాలి. లేకపోతే అందులో బ్యాక్టీరియా ఉండిపోతుంది. కానీ ప్యాకెట్ పాలను ఎక్కువ సమయం వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి అందవు. ఎందుకంటే ప్యాకెట్ పాలను పాశ్చరైజేషన్ చేసి ప్యాకింగ్ చేసి కొనుగోలు చేస్తారు. పాలలో ఉండే బ్యాక్టీరియా నాశనం అయ్యేలా వేడి చేసే ప్యాకెట్ పాలు ఉంటాయి. వీటిని మీరు ఇంకా ఎక్కువగా వేడి చేస్తే అందులోని విటమిన్లు, ప్రొటీన్లు అంతా వ్యర్థం అయిపోతాయి. కాబట్టి ప్యాకెట్ పాలను ఎక్కువ సమయం వేడి చేయకుండా కాస్త గోరువెచ్చగా చేస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.