https://oktelugu.com/

కిడ్నీ అమ్మి యాపిల్ ఫోన్ ను కొన్నాడు.. చివరకు..?

సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలామందికి ఐఫోన్ ను కొనుగోలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మిగతా ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. సాధారణంగా 10,000 రూపాయలకే మనకు మంచి స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అయితే బ్రాండెడ్ ఫోన్ కావడం, ఎక్కువ రోజులు ఉపయోగించినా రీ సేల్ లో ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉండటంతో చాలామంది యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. సామాన్యులకు ఐ ఫోన్ రేటు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2020 / 09:16 PM IST
    Follow us on

    సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలామందికి ఐఫోన్ ను కొనుగోలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మిగతా ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. సాధారణంగా 10,000 రూపాయలకే మనకు మంచి స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అయితే బ్రాండెడ్ ఫోన్ కావడం, ఎక్కువ రోజులు ఉపయోగించినా రీ సేల్ లో ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉండటంతో చాలామంది యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

    సామాన్యులకు ఐ ఫోన్ రేటు వింటేనే గుండె గుభేలుమంటుంది. గతంలో సోషల్ మీడియాలో ఐ ఫోన్ ను కొనుక్కోవాలంటే కిడ్నీ అమ్ముకోవాలని ఒక పోస్ట్ వైరల్ కాగా ఒక వ్యక్తి ఆ పోస్ట్ ను నిజం చేశాడు. చైనాకు చెందిన ఒక వ్యక్తికి ఐ ఫోన్ అంటే చాలా ఇష్టం. దీంతో తొమ్మిదేళ్ల క్రితం ఆ వ్యక్తి ఐ ఫోన్, ఇతర యాపిల్ కంపెనీ డివైజ్ ల కోసం కిడ్నీ అమ్మేశాడు. ఒక కిడ్నీ ఉన్నా ఆరోగ్యంగానే ఉంటానని సదరు వ్యక్తి భావించాడు.

    అయితే ఊహించని విధంగా కొన్ని నెలల క్రితం అతనికి ఉన్న మరో కిడ్నీకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం అతను డయాలసిస్ పై ఆధారపడి జీవిస్తున్నాడు. చైనాకు చెందిన వాంగ్ అనే వ్యక్తి ఎంతో కష్టపడగా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. అప్పట్లో వాంగ్ తన కిడ్నీని 20,000 రూపాయలకు అమ్ముకోగా ఇప్పుడు కిడ్నీ సంబంధిత సమస్యల వల్ల బాధ పడుతున్నాడు.

    వాంగ్ ఐఫోన్, ఇతర యాపిల్ ఉత్పత్తుల కోసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఐ ఫోన్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనలో ఆపరేషన్ చేసిన సర్జన్లను, ఆపరేషన్ కు సహకరించిన వారిని అరెస్ట్ చేశారు.