https://oktelugu.com/

మహేష్ ను ఇలా చూసి తట్టుకోగలమా?

ఆల్ ఇండియాలోనే అందగాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే ఏ అమ్మాయి అయినా పడి చస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 45 ఏళ్లకు చేరువైనా మహేష్ అందం ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంది. Also Read: ‘క్రాక్’తో సీరియస్ అయిన రవితేజ ! కరోనా లాక్ డౌన్ తో గత ఏడు ఎనిమిది నెలలుగా హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన మహేష్ బాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ వేశారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 08:57 PM IST
    Follow us on

    ఆల్ ఇండియాలోనే అందగాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తే ఏ అమ్మాయి అయినా పడి చస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 45 ఏళ్లకు చేరువైనా మహేష్ అందం ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంది.

    Also Read: ‘క్రాక్’తో సీరియస్ అయిన రవితేజ !

    కరోనా లాక్ డౌన్ తో గత ఏడు ఎనిమిది నెలలుగా హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన మహేష్ బాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి అమెరికా ట్రిప్ వేశారు. ఈ క్రమంలోనే మహేష్ టూర్ లోని ప్రతి విషయాన్ని ఆయన భార్య నమ్రత సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు సంతోషాన్ని పంచుతోంది.

    తాజాగా విమానాశ్రయంలో వేచిచూస్తున్న మహేష్ బాబు ఫొటోను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ అభిమానులతో పంచుకున్నారు. ‘తెల్లవారుజామున 3 గంటలకు ఎవరైనా ఇలా కనిపిస్తారా? ఎవరికైనా ఇది సాధ్యమా? మనతో ఒక అందమైన వ్యక్తి ఉండి.. విమానం కోసం వేచి చూస్తున్నప్పుడు సమయం కూడా రెక్కలు కట్టుకొని గాల్లోకి ఎగురుతుంది’ అని మహేష్ అందాన్ని పొగుడుతూ నమ్రత ట్వీట్ చేసింది.

    Also Read: విజయ్ దేవరకొండ… గొప్ప తెలివి ఉన్న హీరో !

    దీనికి మహేష్ సోదరి.. నమ్రత వదిన మంజుల ఆసక్తికర కామెంట్ చేసింది. ‘మీ భర్తకు సాధ్యమే’ అంటూ కామెంట్ చేసింది. ఇలా మహేష్ అందాన్ని ఆయన భార్య, సోదరి సోషల్ మీడియాలో పొగిడేసుకుంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆ ఫొటో చూశాక మీరూ అంటారు.. నిజంగానే మహేశ్ బాబు అందగాడని.. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారివారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్