మనలో చాలామందికి డబ్బు చాలా సందర్బాల్లో అవసరం అవుతుంది. డబ్బు అవసరమైన సమయంలో కొన్ని సందర్భాల్లో వస్తువులను తాకట్టు పెట్టడం లేదా అప్పు చేయడం చేస్తూ ఉంటుంది. కరోనా వైరస్, లాక్ డైన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో ఎక్కువమంది అప్పులపైనే ఆధారపడుతున్నారు. వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయారు.
ఐదు ఆప్షన్ల ద్వారా తక్కువ సమయంలో సులభంగా డబ్బును పొందే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో డబ్బు పొందాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది. క్రెడిట్ సోక్, క్రెడిట్ హిస్టరీ బాగుంటే సులువుగా పర్సనల్ లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. 8.5 శాతం నుంచి 25 శాతం మధ్యలో పర్సనల్ లోన్ కు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే పర్సనల్ లోన్ ను ఆలస్యంగా కూడా తీర్చే అవకాశం ఉంటుంది.
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వాళ్లు అత్యవసర సమయాల్లో వాటిపై లోన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్ ఇస్తాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆప్షన్ ఉంటే డబ్బు లభించకపోయినా మనకు కావాల్సిన ఉత్పత్తులను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
అయితే తక్కువ వడ్డీతో రుణాలను పొందాలని అనుకుంటే గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డుల ద్వారా కూడా తక్కువ వడ్డీకే లోన్ పొందే అవకాశం ఉంటుంది.