Chanakya Neeti : ఆచార్య చాణక్యుడి మాటలు మనకు ఎప్పుడు ఆచరణీయమే. జీవితంలో మనం చేసే పనులు ఎలా ఉండాలి? వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఎవరిని నమ్మాలి? ఎవరిని దూరం చేయాలి? అనే విషయాలు ఎంతో కూలంకషంగా వివరించాడు. మనిషి జీవితంలో చేసే తప్పులు సూటిగా సూచించాడు. వాటి వల్ల కలిగే ఫలితాలను కూడా మనకు కళ్లకు కట్టినట్లు చెప్పాడు. అందుకే చాణక్య నీతి శాస్ర్తంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
మన మీద మనకు నమ్మకం పోతే..
ఒక మనిషి తన మీద తనకు నమ్మకం పెంచుకోవాలి. తన లక్ష్యాలు, గమ్యాలు చేరే వరకు ఎవరికి చెప్పకుండా ఉండాలి. ఎవరికైనా చెబితే నీకే నష్టం. విజయం సాధించే వరకు విశ్రమించకు. నీ గురించి బయట వారికి తెలియనివ్వకు. ఒకవేళ చెబితే నీవు విజయం సాధించకపోతే ఇతరుల ముందు దోషిగా నిలబడతావు. అందుకే మనం విజయం సాధించే వరకు కూడా చెప్పకపోవడమే బెటర్.
నిన్ను నీవు మలుచుకో..
నిన్ను నీవు మలుచుకో. నీ విజయం నీవే నిర్దేశించుకో. నీ మీద నీకు అపనమ్మకం కలిగితే నీ శత్రువుకు బలం అవుతుంది. నీ మీద నీకు ధైర్యం ఉంటే అతడికి భయం కలుగుతుంది. ఇలా జీవితంలో ముందుకు పోవడానికి నిర్ణయించుకో. అంతేకాని ఏదో అవుతుందని భయపడితే ఏదీ సాధించలేవు. నీలోని ఆత్మవిశ్వాసం తొణకకూడదు. విశ్వాసాన్ని నింపాదించుకో. విజయం వైపు అడుగు వేయి.
ఆలోచనలు దాచుకో..
నీలోపల ఉన్న ఆలోచనలను దాచుకో. ఎవరితోనూ పంచుకోకు. కడకు విజయం నీదే అవుతుంది. విజయం కోసం అహర్నిషలు శ్రమించు. పోరాడు. కానీ విజయం మాత్రం సాధించు. ఇలా జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి సుఖాల తీరం చేరుకో. మనసును ప్రశాంతంగా ఉంచుకో. విజయం సాధించిన తరువాత నీలో ఉన్న ప్రతిభ ఏంటో అనేది అందరికి తెలుస్తుంది.